అసెంబ్లీలో పెద్దిరెడ్డికే ఆ సీటు - జగన్ స్థానంపై కొత్త ట్విస్ట్..!!

ఏపీ అసెంబ్లీలో సభ్యులకు సీట్ల కేటాయింపు చేసారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు సభ్యుల స్థానాల ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ట్రెజరీ బెంచ్ లో ముందుగా ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రి తో పాటుగా మంత్రులకు సీట్లు కేటాయించారు. ఆ తరువాత చీఫ్ విఫ్ తో పాటుగా విప్ లకు స్థానాలు ఖరారు చేసారు. ఇక, సభలో కూటమి కాకుండా ఉన్న ఏకైక పార్టీ వైసీపీకి సీట్లు కేటాయింపులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.

ఎవరి సీటు ఎక్కడ
ఏపీ అసెంబ్లీలో సభ్యులకు డిప్యూటీ స్పీకర్ రఘురామ సీట్లు కేటాయిస్తూ ప్రకటన చేసారు. సభలో అధికార కూటమికి కేటాయించే సీట్ల విషయంలో హోదా ఆధారంగా సీట్లు కేటాయించారు. సీని యార్టీ ప్రాతిపదికన ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఒకటో నెంబరు సీట్ కేటాయించగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ​కు 39వ నెంబరు సీట్ ఖరారు చేసా రు. ఇక.. ప్రతిపక్షానికి నిర్దేశించిన బ్లాక్ లో తొలి బెంచ్ లో తొలి సీటును మాజీ మంత్రి..పెద్దిరెడ్డికి కేటాయించారు. ఆయన పక్కన రెండో సీటును మాజీ సీఎం జగన్ కు ఖరారు చేసారు. సభలో ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉన్నా.. కావాల్సిన సంఖ్యా బలం లేకపోవటంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు.

Seat allotment for YS Jagan in Assembly after Peddireddy as seniority basis

పెద్దిరెడ్డి తరువాత
దీంతో, జగన్ కు ప్రతిపక్ష నేత హోదా లేకపోవటంతో.. సీనియార్టీ ప్రాతిపదికన ప్రతిపక్షాల బ్లాక్ లో తొలి సీటు పెద్దిరెడ్డి, రెండో సీటు జగన్ కు కేటాయిస్తూ ప్రకటన చేసారు. ట్రెజరీ బెంచ్ ల్లో మంత్రు లకు రెండు వరుసలు కేటాయించారు. సీనియర్లకు తొలి వరుస.. జూనియర్లకు రెండో వరుసలో కేటాయింపులు చేసారు. అసెంబ్లీలో మొత్తం 12 బ్లాకుల్లో 225 మంది ఎమ్మెల్యేలకు అవసరమైన సీటింగ్ సదుపాయం ఉంది. ఇక..సీనియర్ సభ్యులకు సీట్లు కేటాయింపుపై అసెంబ్లీ లాబీలో నేత ల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. గంట శ్రీనివాసరావుతో పాటు సీనియర్ సభ్యులు మొదటి వరుసలో కూర్చోవాల్సి ఉన్నందున అసెంబ్లీకి హాజరు కాలేరంటూ మంత్రులు వ్యాఖ్యానించారు.

Take a Poll

సీనియార్టీ ఆధారంగా
జగన్ కు సీటు కేటాయింపు పైన సభ్యుల మధ్య ఆసక్తి కర చర్చ జరిగింది. చంద్రబాబు సీటు వెనుక చీఫ్ విప్ తో పాటుగా 16 మంది విప్ లకు సీటు కేటాయించారు. బ్లాక్-1 (ఏ)లో తొలి వరుస లో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, వదరరాజులు రెడ్డి, గంటా శ్రీనివాస రావు కు కేటాయించగా, మిగిలి న రెండు వరుసల్లో మరో ఆరుగురు ఎమ్మెల్యేలకు సీట్లు దక్కాయి. సభ్యుల సీనియార్టీ ఆధారంగానే ఈ సీట్లు కేటాయించినట్లు స్పష్టం చేసారు. కాగా, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ.. కౌన్సిల్ కు హాజరవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+