ఏపీలో పరిషత్ సమరానికి సై, రేపే పోలింగ్- ఈ ప్రాంతాల్లో వాయిదా..!!
స్థానిక సమరంలో మరో పోరుకు సర్వం సిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల ఎన్నికలను 6వ తేదీకి వాయిదా వేసారు. ఇక.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమరం కూటమి- వైసీపీ కి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా రేపు MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 659 ZPTC స్థానాలు, 9,829 MPTC స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో సుమారు 2.81 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఎంపికకు ఈ ఎన్నికలు కీలకం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

పరిషత్ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,333 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నవంబర్ 7వ తేదీ శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కాగా.. మున్సిపల్ ఎన్నికల్లో తక్కువగా పోలింగ్ నమోదు కావటంతో.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జరిగే పోలింగ్ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది.
కాగా.. తుఫాను తదనంతర పరిస్థితుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ ను వాయిదా వేసారు. పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగిపురం మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఈ నెల 6వ తేదీ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఇప్పటి కే 77 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, 2,051 ఎంపీటీసీ స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 2,169 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 18,843 మంది ఎంపీటీసీ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.
మొత్తం 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31,460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 8,904 సమస్యాత్మక, 7,160 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. మొత్తం 16,064 కేంద్రాల్లో సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు. దీంతో.. జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.. ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.














Click it and Unblock the Notifications
