అగ్నివీర్ పై కేంద్రం తీపికబురు

ఆర్మీలో అగ్నిపథ్ పథకం కింద విధుల్లో చేరిన అగ్నివీర్ ల కోసం కేంద్ర ప్రభుత్వం తీపికబురు ఇచ్చింది. తొలి నాలుగు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న అగ్నివీర్లలో ఏకంగా 75 శాతం మందికి మరో రెండేళ్లపాటు సేవలను పొడిగించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల అగ్నివీర్ల మొత్తం సేవా కాలం ఆరు సంవత్సరాలకు పెరుగుతుంది. ఈ అదనపు సేవా కాలం పూర్తయిన తర్వాత వారి ప్రతిభ, క్రమశిక్షణ, బాధ్యతల ఆధారంగా సైన్యంలో శాశ్వత ప్రాతిపదికన రెగ్యులర్ సర్వీసులోకి తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది.

ఈ వివరాలను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రాజా రమణ కొద్దిసేపటి కిందటే వెల్లడించారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి బ్యాచ్ అగ్నివీర్ల నాలుగు సంవత్సరాల పదవీకాలం ముగింపునకు రావడం, వారి సేవలు, పనితీరుపై సైనిక దళాల నుంచి అత్యంత సానుకూల స్పందన లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. త్రివిధ దళాలు ఇచ్చిన సిఫారసుల ప్రాతిపదికన కేంద్ర కేబినెట్ ఈ పొడిగింపునకు ఆమోదముద్ర వేసిందని తెలిపారు.

Centre announces a two-year extension of Agniveers tenure taking their engagement to total six years

ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం.. ఎంపిక చేసిన అగ్నివీర్లకు రక్షణ దళాల్లో తమ నైపుణ్యాలను నిరూపించుకోవడానికి మరింత సమయం లభిస్తుంది. అదనపు రెండేళ్ల కాలంలో వారి దేహ దారుఢ్యం, వివిధ సైనిక బాధ్యతలను స్వీకరించే సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, సైనిక నిబంధనలకు అనుగుణంగా వారి పనితీరును అంచనా వేస్తారు. అగ్నిపథ్ పథకం శారీరక శిక్షణకే పరిమితం కాకుండా, మానసిక వికాసం, టెక్నాలజీపై అవగాహన, నైతిక విలువలను పెంపొందించేలా రూపుదిద్దుకుందని సీడీఎస్ రాజా రమణ స్పష్టం చేశారు.

కోహ్లీ.. కింగ్ ఆఫ్ ఛేజింగ్: ఇన్నాళ్లకు సచిన్ టెండుల్కర్ రికార్డ్ బద్దలు
కోహ్లీ.. కింగ్ ఆఫ్ ఛేజింగ్: ఇన్నాళ్లకు సచిన్ టెండుల్కర్ రికార్డ్ బద్దలు

యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారి విద్యార్హతలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోన్నామని అన్నారు. సర్వీస్ లో ఉన్న సమయంలోనే పదో తరగతి అర్హత కలిగిన అగ్నివీర్లకు ఇంటర్మీడియట్ లో అడ్మిషన్స్, అలాగే ఇంటర్ చదివిన వారికి డిగ్రీ పూర్తి చేసుకునేలా విద్యా కార్యక్రమాలను రూపొందించామని, దీన్ని ఆర్మీ ట్రైనింగ్ తో అనుసంధానించామని వివరించారు. దీనివల్ల వారు విధుల్లో ఉన్నప్పుడే ఉన్నత విద్యను పూర్తి చేసుకుని, ఆర్మీలో గానీ, బయట గానీ మెరుగైన ఉపాధి అవకాశాలు సాధించడానికి ఉపయోగపడుతుందని సీడీఎస్ తెలిపారు.

భారత్ వైపు దూసుకొస్తోన్న 1.5 టన్నుల నాసా స్పేస్ టెలిస్కోప్ శకలాలు: రాడార్ లో హైదరాబాద్
భారత్ వైపు దూసుకొస్తోన్న 1.5 టన్నుల నాసా స్పేస్ టెలిస్కోప్ శకలాలు: రాడార్ లో హైదరాబాద్

అగ్నివీర్ల వేతనాలు, అలవెన్సులు, ప్రమోషన్ల వివరాలను కూడా ఆయన వెల్లడించారు. పొడిగించిన సేవా కాలంలో మొదటి సంవత్సరంలో నెలకు రూ. 43,500, రెండో సంవత్సరంలో నెలకు రూ. 47,000 వరకు వేతనం లభిస్తుందని, వీటితో పాటు పథకం ప్రారంభంలో నిర్ణయించిన సేవా నిధి ప్యాకేజీ ప్రయోజనాలు కూడా యథావిధిగా కొనసాగుతాయని అన్నారు. త్రివిధ దళాల్లోని వివిధ విభాగాలు, హోదాల్లో అగ్నివీర్లకు వారి అర్హతలను బట్టి విసృతమైన అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.

కర్ణాటకలో అమాంతం పెరిగిన ఆర్టీసీ బస్ ఛార్జీలు: బీఎంటీసీ బస్సుల్లో కనీస ఫేర్ ఇంత
కర్ణాటకలో అమాంతం పెరిగిన ఆర్టీసీ బస్ ఛార్జీలు: బీఎంటీసీ బస్సుల్లో కనీస ఫేర్ ఇంత

అగ్నిపథ్ పథకం అమలు అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, క్షేత్రస్థాయి అనుభవాలు, అవసరాలను బట్టి తగిన మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీడిఎస్ రాజా రమణ వివరించారు. అగ్నివీర్ల క్రమశిక్షణ, సేవలు సైన్యానికి నూతన శక్తిని ఇచ్చాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+