ఏపీకి మరో తుఫాను ముప్పు, ఈ జిల్లాల పై ప్రభావం- తాజా అంచనాలు..!!
ఏపీని వరుస తుఫాన్లు వెంటాడుతున్నాయి. ఆర్నాబ్, మురుసు తుఫాన్లు భారీ నష్టం మిగిల్చాయి. ఈ రెండింటి నుంచి పూర్తిగా బయట పడకముందే మరో తుఫాను దూసుకొస్తోంది. ఈ నెల 15వ తేదీ తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో.. ముందస్తుగా ఈ తుఫాను గమనం పైన ఫోకస్ చేసారు. ఈ రెండు నెలల కాలంలో వరుస తుఫాన్ల పైన ఐఎండీ అంచనాలు వెల్లడించింది.
ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న వాతావరణ ఆవర్తనాలు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే వరుస తుపాన్లతో తీర ప్రాంతాలు తడిసిముద్దవుతుండగా నవంబర్ 15 తర్వాత బంగాళాఖాతంలో కొత్త తుపాను రూపుదిద్దుకునే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావం ప్రధానంగా ఏపీలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు తమిళనాడుపై పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ తుపాను దిశ, తీవ్రతపై రాబోయే రోజుల్లో స్పష్టత రానుండగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్ మాసాలు బంగాళాఖాతంలో తీవ్ర తుపాన్ల సీజన్‌గా పరిగణిస్తారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ రెండు నెలల కాలంలో ఒకదాని వెంట ఒకటి వరుసగా తుపాన్లు విరుచుకుపడే పరిస్థితులు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ నెల 15 తరువాత తుఫానుకు ఛాన్స్
కాగా, ఈ తుఫాను ఏపీలో సీమ జిల్లాలతో పాటుగా ఉత్తర తమిళనాడు తీరాలపై కేంద్రీకృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాల పరిధిలో దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు సముద్రం అల్లకల్లోలంగా మారే ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతానికి ఇది మోడల్స్ సూచిస్తున్న ముందస్తు వాతావరణ అంచనా మాత్రమేనని, నవంబర్ రెండో వారం తర్వాత అల్పపీడన ద్రోణి ఏర్పడినప్పుడే దాని ఖచ్చితమైన గమనం, వేగం మరియు ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. వాతావరణ వ్యవస్థల్లో వచ్చే మార్పులను నిరంతరం ట్రాక్ చేస్తున్నామని, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తామని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.












Click it and Unblock the Notifications
