విజయవాడ ఎయిర్ పోర్టుకు గుడ్ న్యూస్..! త్వరలో ఆ ఫెసిలిటీ..!

విజయవాడ ఎయిర్ పోర్టు ద్వారా రాకపోకలు సాగించే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. ఈ ఎయిర్ పోర్టును పూర్తిస్దాయిలో అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఓ కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన వివరాలను పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఇవాళ వెల్లడించారు.ప్రయాణికులకు తక్కువ ధరలకు అల్పాహారం, తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఉడాన్ యాత్రి కేఫ్ ను ఆయన ఇవాళ ఎయిర్ పోర్టులో ప్రారంభించారు. అనంతరం ఉడాన్ యాత్రి కేఫ్ మెనూ కార్డ్‌ను ఆవిష్కరించారు.

విజయవాడ విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరుగుతోందని కేంద్రమంత్రి తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త టెర్మినల్ నిర్మాణ పనులను వేగవంతం చేశాం. మరో రెండు మూడు నెలల్లో ఈ టెర్మినల్ ప్రారంభం కానుందన్నారు. విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఆధునిక సౌకర్యాలతో దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందుతుందన్నారు. అలాగే ప్రయాణికుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని రామ్మోహన్ తెలిపారు. ఎయిర్‌పోర్టులో సాధారణ ప్రయాణికులు అధిక రేట్లతో ఇబ్బంది పడుతున్నారని ఫీడ్‌బ్యాక్ ద్వారా తెలిసిందని, ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.

second terminal opening in Vijayawada international airport soon says aviation minister

విమాన చార్జీలు తగ్గడంతో మధ్యతరగతి కుటుంబాల ప్రయాణికులు గణనీయంగా పెరిగారని, ఈ ఉడాన్ యాత్రి కేఫ్ వారికి ఎంతో పనికొస్తుందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో నత్తనడకన సాగిన విజయవాడ టెర్మినల్ భవనం నిర్మాణం ప్రస్తుతం వేగంగా కొనసాగుతోందని వివరించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో త్వరలోనే అహ్మదాబాద్, వారణాసి, కొచ్చిన్, పూణే నగరాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.

second terminal opening in Vijayawada international airport soon says aviation minister

దేశంలో విమానయాన రంగం గత పదేళ్లలో విప్లవాత్మకమైన పురోగతిని సాధించిందని పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పదేళ్ల క్రితం దేశంలో కేవలం 74 ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉండేవి. కానీ కేంద్రం నిర్ణయాలు, సుదూర పట్టణాలకు కనెక్టివిటీ కల్పించే ప్రణాళికలతో ఇప్పుడు 160 ఎయిర్‌పోర్టులు పని చేస్తున్నాయన్నారు. దీంతో చిన్న పట్టణాలకూ విమాన సదుపాయం అందుబాటులోకి వచ్చింది. సామాన్యులు కూడా తక్కువ ఖర్చుతో విమానాల్లో ప్రయాణించే స్థితికి చేరుకున్నారు" అని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+