సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ లో కీలక మార్పు, ఇక నుంచి కొత్తగా..!!

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ కు అదనంగా మరిన్ని కొత్త సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. తొలి విడతలోనే వందేభారత్ స్లీపర్ ను తెలుగు రాష్ట్రాలకు కేటాయించేలా కసరత్తు జరుగుతోంది. అదే విధంగా విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు మరో సర్వీసును వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఇదే సమయంలో సికింద్రాబాద్ - తిరుపతి మధ్య కొనసాగుతున్న వందేభారత్ కు సంబంధించి రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

తిరుపతి- సికింద్రాబాద్ వందేభారత్ కు తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ పెరుగుతోంది. మంగళవారం మినహా ఈ రైలు అందుబాటులో ఉంటోంది. దీంతో.. ఇదే మార్గంలో వందేభారత్ స్లీపర్ సైతం కేటాయించాలనే డిమాండ్ పెరుగుతోంది. అయితే, దీని పైన రైల్వే శాఖ తుది నిర్ణయం కోసం ప్రతిపాదన పెండింగ్ లో ఉంది. కాగా.. తిరుపతి-సికింద్రాబాదు వందేభారత్‌ రైలు ఇప్పుడు ఆరెంజ్‌ కలర్‌లో రాకపోకలు సాగించనుంది. కొత్తగా ఆరెంజ్‌ రంగులో 20 బోగీల రైలుగా మారింది. ఇందులో 1,440సీట్ల సామర్థ్యం ఉంది. తిరుపతి మీదుగా రాకపోకలు సాగించే అతిపెద్ద రైళ్లలో ఇదొకటి. కాగా, 102 వందేభారత్‌ రైళ్లలో ఈ రైలు మాత్రమే ప్రత్యేకంగా ఆరెంజ్‌ రంగులో నడుస్తుండడం విశేషం. గతంలో తెలుపు రంగులో ఉంది. ఈ రైలును 2023 ఏప్రిల్‌ 9న ప్రారంభించారు. కొన్ని నెలలపాటు 8 బోగీలతో నడిచింది. ప్రయాణికుల ఆదరణ..డిమాండ్‌ పెరగడంతో 20 బోగీలకు పెంచారు.

secunderabad-tirupati-vandebharat-express-continue-in-orange-livery-details-here

ఈ రైలులో 2 ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌, 14 ఏసీ చైర్‌కార్‌లతో కలిపి మొత్తం 16బోగీలతో నడుస్తున్న వందే భారత్‌కు అదనంగా మరో 4 ఏసీ చైర్‌కార్లను శాశ్వత ప్రాతిపదికన జత చేసారు.కాగా, ఈ మార్గంలో వందేభారత్‌కు స్టాపేజీలు, వేళల్లో ఎటువంటి మార్పులేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు లో వెయింటింగ్ లిస్టు నిత్యం పెరుగుతున్న కారణంగా ప్రయాణీకుల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ద్వారా మొత్తం 660కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8గంటల 30నిముషాల్లోనే చేరుకుంటుంది. ఈ రూట్ లో నాలుగు స్టేషన్లు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో మాత్రమే స్టాప్స్ కేటాయించారు. కాగా.. ఈ రైలు ప్రారంభం నుంచి ప్రయాణీకుల నుంచి ఆదరణ కొనసాగుతోంది. దీంతో.. ఇప్పుడు ఈ కోచ్ ల సంఖ్య పెంపు నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా విజయవాడ నుంచి బెంగళూరు వయా తిరుపతి మధ్య మరో వందేభారత్ వచ్చే నెల నుంచి పట్టాలెక్కనుంది. ఈ మేరకు ముహూర్తం ఖరారైంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే విజయవాడ నుంచి తిరుపతికి నాలుగున్నార గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+