Railway News :సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రెడీ : ముహూర్తం - రూట్ ఖరారు..!!

తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ పట్టాలెక్కనుంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడుస్తున్న వందేభారత్ కు ఆదరణ పెరుగుతోంది. దీంతో..తెలుగు రాష్ట్రాల నుంచి మరో మూడు కొత్త వందేభారత్ రైళ్లకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చిది. అందులో సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందేభారత్ రైలు ప్రారంభానికి రంగం సిద్దమైంది. దీనికి సంబంధించి రూట్ ను కూడా ఖరారు చేసారు. రైలు నెంబర్..రైలు వేళలు మాత్రం ప్రకటించాల్సి ఉంది. దీని ద్వారా ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమలకు వేగంగా చేరుకొనే వెసులుబాటు కలుగుతోంది.

సికింద్రాబాద్ - తిరుపతి మధ్య పలు రైళ్లు ప్రస్తుతం ఉన్నా..రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో..ఈ మార్గంలో వందేభారత్ తీసుకురావాలన నిర్ణయించారు. ఏప్రిల్ 8న వందేభారత్ ఈ మార్గంలో ప్రారంభించేందుకు నిర్ణయించారు. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే శాఖకు సమాచారం ఇచ్చారు. ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఇతర రైళ్లల్లో దాదాపు 12 గంటల సమయం పడుతోంది. వందేభారత్ అందుబాటులోకి రావటం ద్వారా ఆరు నుంచి ఏడు గంటల సమయంలో గమ్య స్థానానికి చేరుకొనే అవకాశం కలుగుతుంది. గంటకు 130 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే విధంగా ట్రాక్ ల పటిష్ఠతను పరిశీలిస్తున్నారు.

Secunderabad to Tirupati Vandebharat service likely to inguaragte on 8th April, Route finalised.

వందేభారత్ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కనీస ధర రూ 1150 గా ఉండనుంది. రైలు నెంబర్ పైన ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రెండు మార్గాల్లో ప్రస్తుతం రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ - ఖాజీపేట- విజయవాడ- తెనాలి- ఒంగోలు మీదుగా ఒక మార్గంలో వెళ్తున్నాయి. అదే విధంగా బీబీనగరం - నల్గొండ - గుంటూరు- తెనాలి- నెల్లూరు మీదుగా మరో మార్గం లో ప్రయాణాలు సాగుతున్నాయి. ఇప్పుడు వందేభారత్ ను నారాయణాద్రి మార్గంలోనూ గుంటూరు మీదుగా ప్రస్తుతం కొనసాగించాలని నిర్ణయించారు. మూడో మార్గం గుంటూరను టచ్ చేయకుండా శావల్యాపురం మీదుగా ఒంగోలు వెళ్లేలా ఆలోచన చేసారు. అయితే, వందేభారత్ ను ప్రస్తుతానికి గుంటూరు -తెనాలి మార్గంలోనే ఆపరేట్ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో ట్రాక్ - కోచ్ ల నిర్వహణతో పాటుగా ప్రారంభోత్సవానికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే గుంటూరు, తిరుపతి డివిజన్ రైల్వే అధికారులను అప్రమత్తం చేసింది.

Secunderabad to Tirupati Vandebharat service likely to inguaragte on 8th April, Route finalised.

తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా మూడు వందేభారత్ రైళ్లను ప్రవేశ పెట్టేందుకు నిర్ణయించారు. అందులో ఇప్పుడు సికింద్రాబాద్ - తిరుపతి రైలుకు లైన్ క్లియర్ అయింది. రానున్న రెండు నెలల కాలంలోనే మరో రెండు వందేభారత్ రైళ్లు తెలుగు రాష్ట్రాలకు దక్కనున్నాయి. అందులో ఒకటి కాచిగూడ నుంచి బెంగుళూరు, అదే విధంగా సికింద్రాబాద్ నుంచి పూణే కు నడపాలని నిర్ణయంచారు. ప్రస్తుతం ఈ రెండు ఐటీ సిటీలకు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగుతున్నాయి. వందేభారత్ ప్రవేశ పెట్టటం ద్వారా ఏ మేర ఆక్యెపెన్సీ ఉంటుందనే అంశం పైన సర్వే చేసారు. అనకూల ఫలితాలు రావటంతో..త్వరలోనే ఈ రెండు రూట్లలోనూ వందేభారత్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+