వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంటా ఇంట్లో ఫ్యూచర్‌ప్లాన్, షర్మిల చిరునవ్వు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/శ్రీకాకుళం: సిడబ్ల్యూసి విభజన నిర్ణయం నేపథ్యంలో రాష్ట్ర సమైక్యత కోసం ఆయా పార్టీలకు చెందిన సీమాంధ్ర కాంగ్రెసు నేతలు మంతనాలు సాగిస్తున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఉద్యమాల్లో పాల్గొంటుండగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల సమైక్య శంఖారావ యాత్రతో ముందుకు సాగుతున్నారు.

సోమవారం సాయంత్రం మంత్రి గంటా శ్రీనివాస రావు నివాసంలో సీమాంధ్ర మంత్రులు సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి తమను లక్ష్యంగా చేసుకోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరేందుకు మళ్లీ ఢిల్లీ బాట పట్టాలని భావిస్తున్నారు.

మరోవైపు షర్మిల సమైక్య శంఖారావ యాత్ర సోమవారం శ్రీకాకుళం జిల్లాలో సాగింది. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ అధిష్ఠానం తెలుగు జాతిని నిలువునా చీల్చిందని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగితే కాంగ్రెస్, టిడిపిలే బాధ్యత వహించాలని, తెలుగువారి భిక్షతో గెలిచిన కాంగ్రెస్ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు.

మాట్లాడుతున్న షర్మిల

మాట్లాడుతున్న షర్మిల

సమైక్య శంఖారావం బస్సు యాత్రలో శనివారం శ్రీకాకుళం జిల్లాలో మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల.

ఆదరణ మధ్య సమైక్య శంఖారావం

ఆదరణ మధ్య సమైక్య శంఖారావం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల సమైక్య శంఖారావ యాత్ర అశేష జనవాహిని మధ్య శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న దృశ్యం.

అభివాదం

అభివాదం

సమైక్య శంఖారావం బస్సు యాత్రకు ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో తరలి వచ్చిన వారికి అభివాదం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల.

అశేష జనవాహిని

అశేష జనవాహిని

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల సమైక్య శంఖారావ యాత్ర అశేష జనవాహిని మధ్య శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న దృశ్యం.

షర్మిల ఆనందం

షర్మిల ఆనందం

తన సమైక్య శంఖారావ యాత్రకు తరలి వచ్చిన కార్యకర్తలను, సమైక్యవాదులను చూసి చిరునవ్వు చిందిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు.

జన సందోహం మధ్య

జన సందోహం మధ్య

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల సమైక్య శంఖారావ యాత్రకు భారీగా జనం తరలి వచ్చారు. జనం మధ్యలో బస్సు పై నుండి మాట్లాడుతున్న షర్మిల.

నమస్కారం..

నమస్కారం..

సమైక్య శంఖారావం బస్సు యాత్రకు ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో తరలి వచ్చిన వారికి నమస్కారం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల.

గంటా ఇంట్లో భేటీ

గంటా ఇంట్లో భేటీ

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు గంటా శ్రీనివాస రావు నివాసంలో సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. వారు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

హాజరైన వారు..

హాజరైన వారు..

మంత్రి గంటా శ్రీనివాస రావు నివాసంలో భేటీ అయిన సీమాంధ్ర మంత్రులు.. టిజి వెంకటేష్, శైలజానాథ్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, అహ్మదుల్లా.. తదితరులు.

విలేకరులతో..

విలేకరులతో..

మంత్రి గంటా శ్రీనివాస రావు నివాసంలో భేటీ పూర్తయిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మంత్రి శైలజానాథ్, ఇతరులు. వీరు సమైక్యాంధ్ర కోసం మరోసారి ఢిల్లీ వెళ్లాలని భావిస్తున్నారు.

English summary
Congress leaders from the Seemandhra regions have said they would soon hold a comprehensive meeting to chalk out the future course of action against the proposed bifurcation of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X