వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంటోని నివేదిక: సీమాంధ్ర నేతలకు మొయిలీ హామీ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంటోని కమిటీ నివేదిక ఇచ్చే వరకు విభజనపై కేబినెట్ నోట్ వచ్చే అవకాశం లేదని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలకు ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ హామీ ఇచ్చారు! సీమాంధ్ర నేతలు పలువురు బుధవారం మొయిలీని కలిశారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరారు.

ఈ సందర్భంగా మొయిలీ వారితో మాట్లాడుతూ... ఆంటోని కమిటీ నివేదిక ఇచ్చే వరకు విభజనపై కేబినెట్ నోట్ వచ్చే అవకాశం లేదని చెప్పారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను ఆంటోని కమిటీలో పొందుపరుస్తామని చెప్పారు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గౌరవిస్తారని చెప్పారు.

నమ్మకం ఉంది: అనంత

ఆంటోని కమిటీ నివేదిక ఇచ్చే వరకు విభజనపై కేంద్రం ముందుకు వెళ్లదనే నమ్మకం తమకు ఉందని అనంతపురం ఎంపి అనంత వెంకట్రామి రెడ్డి చెప్పారు. సోనియా, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తదితరులను కలిసి సీమాంధ్ర ప్రజల ఆవేదనను తెలియజేస్తామన్నారు.

ఎపిఎన్జీవో సమ్మె పిటిషన్ రేపటికి వాయిదా

ఎపిఎన్జీవోల సమ్మె పిటిషన్ పైన విచారణను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు విచారణ గురువారానికి వాయిదా వేసింది. ప్రస్తుత పరిస్థితులో సమ్మె చేస్తున్న ఉద్యోగులపై చర్యలు చేపట్టే అధికారం ప్రభుత్వానికి లేదని ఎపిఎన్జీవోలు హైకోర్టుకు తెలిపారు.

సర్వీసు నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఎస్మా మాత్రమే ప్రయోగించవచ్చునని ఎపిఎన్జీవోల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సమ్మె చట్టవిరుద్ధమా కాదా అనే అంశాన్ని నిర్ణయించే విచక్షణాధికారం కేవలం ప్రభుత్వానికే ఉందని వారు తెలిపారు.

English summary
Seemandhra Ministers on Tuesday met Congress Party senior leader Veerappa Moily over state bifurcation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X