హైదరాబాద్‌పై అబద్దాలు: కెటిఆర్, ఓర్పును..: డిగ్గీపై కెకె

Seemandhra leaders saying lies on Hyderabad: KTR
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు విషయంలో సీమాంధ్ర నాయకులు కేంద్రానికి అబద్దాలు చెబుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం మండిపడ్డారు. పార్టీ సీనియర్ నేతలు కె కేశవ రావు, వివేక్, కెటి రామారావులు తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర నేతలు హైదరాబాదుకు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. వారి ఆస్తులు పెంచుకోవడం తప్ప ఏం చేయలేదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కలవకముందే హైదరాబాదు మహానగరం అని, అప్పుడు దేశంలో ఐదో స్థానంలో ఉందని ఇప్పుడు కూడా అదే స్థానంలో ఉందన్నారు. హైదరాబాదు ఆదాయం పైన కూడా వారు అబద్దాలు చెబుతున్నారన్నారు. సీమాంధ్రులతో ఆదాయం పైన డొల్ల వాదన అన్నారు. తెలంగాణ కోసం పోరాడామని, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని చెబుతున్న తెలంగాణ కాంగ్రెసు నేతలు అధికారంలో ఉండి ఎవరి పైన పోరాడారో, ఇప్పుడు ఇవ్వకుండా తర్వాత అమరవీరుల కుటుంబాలకు ఎలా న్యాయం చేస్తారని మండిపడ్డారు.

హైదరాబాదుకు యాభై వేల కోట్లు ఖర్చు పెట్టామని సీమాంధ్ర నేతలు చెబుతున్నారని, దాని పైన శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాదు నిధులు ఇరు ప్రాంతాలకు కేటాయిస్తే తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. సీమాంధ్రలో కేవలం ఏడు లక్షల మంది సీమాంధ్రులే ఉన్నారని, శ్రీకృష్ణ కమిటీ నివేదికను కూడా వారు తప్పు దారి పట్టిస్తున్నారని ఎంపి వివేక్ అన్నారు.

తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము కేంద్రానికి నివేదిక ఇస్తామని కెకె చెప్పారు. తమ నీళ్లు, తమ ఉద్యోగాలు తమకు కావాల్సిందే అన్నారు. ఎలాంటి షరతులు లేని తెలంగాణ కావాలని, సంపూర్ణ తెలంగాణ రాకపోతే తెలంగాణ కాంగ్రెసు నేతలు ప్రజా ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. పదమూడేళ్లుగా తెరాస ఉద్యమాన్ని ఉధృతం చేసిందన్నారు. అధికారులు లేని తెలంగాణ తమకు ఎందుకన్నారు.

తాము కోరుకుంటోంది సంపూర్ణ తెలంగాణ అన్నారు. పదేళ్ల తర్వాత తెలంగాణ వారే బాధపడుతారన్న దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను కెకె ఖండించారు. తమ ఓర్పును, సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. తెలంగాణపై ఆంక్షలు పెడితే ప్రజలు ఊరుకోరన్నారు. జివోఎంకు తెలంగాణ ప్రజల డిమాండ్‌ను చెబుతామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణమే తమ లక్ష్యమన్నారు. హైదరాబాదు పైన కేంద్రం అధికారం ఒప్పుకునేది లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+