వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి: ప్రధాని ఇంటి వద్ద ఉద్రిక్తం, ఇక్కడ భేటీలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణపై కేబినెట్ నోట్ వస్తుందనే వార్తల నేపథ్యంలో గురువారం రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేబినెట్ నోట్ విషమయై రాష్ట్రం నుండి ఢిల్లీ స్థాయి వరకు జోరుగా చర్చ సాగింది. ఢిల్లీ పెద్దలు నోట్ పైన భిన్నంగా మాట్లాడినప్పటికీ చివరకు కేంద్రహోంమంత్రి షిండే నోట్ ప్రవేశ పెట్టారు.

ఆ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీలో పాల్గొన్న సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నాయకులు కావూరి సాంబశివ రావు, పల్లం రాజులు నోట్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా వారిని లక్ష్య పెట్టకుండా తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిపారు. మరోవైపు కేబినెట్ నోట్ నేపథ్యంలో హైదరాబాదులో కాంగ్రెసు నేతలు భేటీ అయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

కేబినెట్ నోట్ నిర్ణయం నేపథ్యంలో ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇంటిని సీమాంధ్ర విద్యార్థులు ముట్టడించే ప్రయత్నం చేశారు. ఆయన ఇంట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసినా పోలీసులు అడ్డుకున్నారు.

షిండే

షిండే

కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిపిన అనంతరం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే.

వివేక్, మందా

వివేక్, మందా

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిపిన అనంతరం హర్షం వ్యక్తం చేస్తున్న తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు వివేకా, మందాలు.

విద్యార్థులు 1

విద్యార్థులు 1

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసం వద్ద సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఆందోళన చేస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న దృశ్యం.

విద్యార్థులు 2

విద్యార్థులు 2

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసం వద్ద సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఆందోళన చేస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని వ్యాన్ ఎక్కిస్తున్న దృశ్యం.

నోట్‌తో షిండే!

నోట్‌తో షిండే!

గురువారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కేబినెట్ భేటీకి తెలంగాణ నోట్‌తో వస్తున్న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమర్ షిండే.

సి రామచంద్రయ్య

సి రామచంద్రయ్య

గురువారం జరిగిన సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరైన దేవాదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్య వాహనంలో వెళ్తున్న దృశ్యం.

జెసి దివాకర్ రెడ్డి

జెసి దివాకర్ రెడ్డి

గురువారం జరిగిన సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరైన మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వాహనంలో వెళ్తున్న దృశ్యం.

గాదె, లగడపాటి, గల్లా

గాదె, లగడపాటి, గల్లా

గురువారం జరిగిన సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరైన ఎంపి లగడపాటి రాజగోపాల్, మంత్రి గల్లా అరుణ కుమారి, మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డిలు వాహనంలో వెళ్తున్న దృశ్యం.

పాలడుగు, పార్థసారథి

పాలడుగు, పార్థసారథి

గురువారం జరిగిన సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరైన మంత్రి పార్థసారథి, ఎమ్మెల్సీ పాలడుగులు వాహనంలో వెళ్తున్న దృశ్యం.

శైలజానాథ్

శైలజానాథ్

సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధుల సమావేశం అనంతరం గురువారం విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి సాకె శైలజానాథ్ దృశ్యం.

ఆనం వివేకా

ఆనం వివేకా

సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధుల సమావేశానికి ముందు మంత్రుల క్వార్టర్సు ముందు మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి.

టిజి వెంకటేష్, ఏరాసు

టిజి వెంకటేష్, ఏరాసు

సీమాంధ్ర కాంగ్రెసు ప్రజాప్రతినిధుల భేటీకి హాజరైన మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిజి వెంకటేష్‌లు గురువారం విలేకరులతో మాట్లాడుతున్న దృశ్యం.

English summary
Students from Seemandhra regions protest at Prime Minister Manmohan Singh's residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X