పవన్ కళ్యాణ్‌పై శేఖర్ కమ్ముల సెటైర్: గుత్తా ఫైర్

ఆ ఆవేశం ఎటుపోయిందని ఆయన పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. ఒక అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మరో అరాచాకాన్ని అరువు తెచ్చుకోవడం పొరపాటు అనిపించుకోదని, దీనికి సేనతో పని లేదని ఆయన అన్నారు. ఒక వ్యక్తిని గెలిపించండని చెప్పడానికి ఇంత ఆవేశం ఆక్కరలేదని ఆయన పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి అన్నారు.
కులం, మంతం, ప్రాంతం పేరున విద్వేషాలు రేపి ఎన్నికల్లో గెలవాలని చూసే ఏ వ్యక్తికి గానీ పార్టీకి గానీ మనల్ని పరిపాలించే అర్హత లేదని శేఖర్ కమ్ముల అన్నారు. మోడీని గెలిపించాలని విశాఖపట్నం సభలో పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, పవన్ కళ్యాణ్‌పై నల్లగొండ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. పవన్ కళ్యాణ్ తన అబిమానులను పిచ్చోళ్లను చేశాడని ఆయన శనివారం నల్లగొండలో వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పవన్ కళ్యామ్ జనసేన నీటి బుడగ అని ఆయన అన్నారు. నిజాలు చెప్తారని అంటున్న పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గోద్రా సంఘటనపై వాస్తవాలు చెప్పగలరా అని అడిగారు.












Click it and Unblock the Notifications