పవన్ కల్యాణ్ ఇలాంటోడని అనుకోలేదు
అమరావతి/న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. దేశ రాజధానికి చేరుకున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి కొద్దిసేపటి కిందటే దేశరాజధానిలో ల్యాండ్ అయ్యారు. మంగళవారం జరగాల్సిన ఎన్డీఏ సంకీర్ణ కూటమి భాగస్వామ్య పక్షాల భేటీకి పవన్ కల్యాణ్ హాజరు కావాల్సి ఉంది.
Recommended Video

బీజేపీతో పొత్తులో ఉన్న నేపథ్యంలో ఈ సమావేశంలో పాల్గొనడానికి ఇదివరకే ఆయనకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. జనసేనతో పాటు బీజేపీతో పొత్తు, ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటోన్న 38 పార్టీలు నాయకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సాయంత్రం ఈ భేటీలో పాల్గొనున్నారు.

ఈ పరిణామాల మధ్య పవన్ కల్యాణ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకుని 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన వామపక్షాల నాయకులు ఆయనపై భగ్గుమంటోన్నారు. నిలకడ లేని రాజకీయ నాయకుడిగా ధ్వజమెత్తుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆయనను పావుగా వాడుకుంటోందని మండిపడుతున్నారు.
పవన్ రాజకీయాలు చేయడానికి వచ్చినట్లు కనిపించట్లేదని సీపీఐ సీనియర్ నేత కే నారాయణ ఆరోపించారు. తనకు చెగువేరా ఆదర్శమని, ఆయనలా డ్రెస్సులు వేసుకున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు మితవాదులైనటువంటి సావర్కర్‌గా మారిపోయాడంటూ ఎద్దేవా చేశారు. తన విధానాలను ఇలా ఎప్పటికప్పుడు ఎందుకు మార్చుకుంటోన్నాడని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తున్నారా? లేక ఇంకా ఏమైనా చేస్తున్నారా? అంటూ ధ్వజమెత్తారు నారాయణ. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని, లౌకిక వ్యవస్థను కాలరాస్తోందని అన్నారు. దర్యాప్తు ఏజెన్సీల ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ మండిపడ్డారు. ఏపీలో బీజేపీ ఎలాగూ లేదు కాబట్టి.. పవన్ కల్యాణ్‌ను కూడా కలుపుకెళ్లి బంగాళాఖాతంలో తోస్తోందని చురకలు అంటించారు.
బీజేపీ-టీడీపీ మధ్య జనసేన మధ్యవర్తిత్వం చేయడానికే పవన్ కల్యాణ్ ఎన్డీఏ భేటీకి వెళ్లినట్లు కనిపిస్తోందని నారాయణ పేర్కొన్నారు. ఒకవంక అతివాద చెగువేరాను అనుసరించిన వ్యక్తి.. ఇప్పుడు మితవాద సావర్కర్ విధానాలను అనుసరించడం వెనుక టీడీపీ ప్రమేయం ఉందని తాను భావిస్తున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications