వైసీపీలోకి ఉండవల్లి - ముహూర్తం ఫిక్స్, అదే బాటలో..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ లక్ష్యంగా కూటమి పార్టీల నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు. అటు జగన్ ప్రభుత్వం పైన విమర్శల తీవ్రత పెంచారు. వైఎస్సార్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు వైసీపీ బాట పడుతున్నారు. తాజా గా మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు చర్చలు పూర్తయినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి మరి కొందరు సీనియర్లు సైతం వైసీపీలోకి రానున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది.
వైసీపీలో చేరికలు
ఎన్నికల్లో ఓడిన తరువాత జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం పైన ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని జగన్ చెబుతున్నారు. ప్రభుత్వం పైన విమర్శలను ఎక్కు పెట్టారు. ఇటు పార్టీ కార్యకర్తల కోసం తాను గతం కంటే భిన్నంగా పని చేస్తానని హామీ ఇస్తున్నారు. ఉగాది నుంచి జిల్లాల పర్యటనలకు జగన్ సిద్దం అవుతున్నారు. ఇటు వైసీపీలో ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారు. ఈ సమయంలోనే గత అనుభవాలు.. ఓటమితో జగన్ వ్యూహం మార్చారు. నాడు వైఎస్సార్ తో సన్నిహితంగా ఉన్న సీనియర్లను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు బెంగళూరు కేంద్రంగా చర్చలు సాగుతున్నాయి.

రీ ఎంట్రీ ఇస్తారా
అందులో భాగంగానే ముందుగా మాజీ మంత్రి శైలజానాధ్ వైసీపీలో చేరారు. ఇప్పుడు మాజీ ఎంపీ ఉండవల్లి వైసీపీలో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. 2014లో రాష్ట్ర విభజన తరువాత ఉండవల్లి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. విభజన బిల్లు వ్యతిరేకించటంతో నాడు కాంగ్రెస్ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ.. విభజన సమస్యల పైన పోరాటం చేస్తున్నారు. జగన్ సీఎం అయిన సమయం లో పూర్తి మద్దతుగా నిలిచారు. ఆ తరువాత జగన్ పైన విమర్శలు చేసారు. తాజాగా జగన్ ఓడిన తరువాత పరిమితంగానే స్పందిస్తున్నారు. పోలవరం పైన ఉండవల్లి ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు.
ఉండవల్లి వస్తున్నారంటూ
బీజేపీకి తొలి నుంచి వ్యతిరేకిగా ముద్ర పడిన ఉండవల్లి.. ప్రస్తుతం వైసీపీలోకి రావాలంటూ ఆ పార్టీ ముఖ్య నేతలు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వైఎస్ సన్నిహితుడుగా పేరున్న ఉండవల్లి రాకతో పార్టీకి మంచి వాయిస్ ఉంటుందని భావిస్తున్నారు. ఉండవల్లి ఈ నెల 26 తరువాత వైసీపీలో చేరుతారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. కానీ, రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉండవల్లి నిజంగా వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారా లేదా అనేది ఆయన నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇక, కాంగ్రెస్ లో సీనియర్లుగా ఉన్న తూర్పు గోదావరి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన నేతలు వైసీపీలో చేరటం ఖాయమైందని సమాచారం. దశల వారీగా పార్టీలో సీనియర్ల చేరికలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో, వైసీపీలో చేరికల అంశం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications