చంద్రబాబుగారూ.. పొత్తంటున్నారు.. ఇలా చేస్తున్నారేంటి?
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లడం దాదాపు ఖాయమైన పరిస్థితుల్లో ఈ రెండు పార్టీ బీజేపీని కూడా కలుపుకొని వెళదామని చూస్తున్నాయి
తెలుగుదేశం పార్టీలో చేరికలు జరుగుతున్నందుకు ఆనందపడాలా? వద్దా? అనే అయోమయావస్థలో తెలుగుదేశం పార్టీ ఉంది. విడవమంటే పాముకు కోపం.. కరవమంటే కప్పకు కోసం అన్నరీతిలో తెలుగుదేశం పార్టీ రాజకీయ వాతావరణం ఉంది. పార్టీలో చేరేవారంతా వైసీపీ నుంచో, మరే ఇతర పార్టీల నుంచో వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండేదికాదు. కానీ వచ్చేవారంతా భారతీయ జనతాపార్టీ నేతలే వస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ (Kanna laxminarayana) తాజాగా తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తి పార్టీ మారడంపై అసలు పార్టీలో ఏం జరుగుతోందంటూ అధిష్టానం ఆరా తీసింది.

సోము, జీవీఎల్ పై కన్నా బండ
వెళ్తూ వెళ్తూ కన్నా సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావుపై పెద్ద బండేశారు. చాలామంది నేతలు వీరి వ్యవహారశైలిలో ఆగ్రహంగా ఉండటంతో అసమ్మతి నాయకులందరినీ పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించి మాట్లాడుతోంది. కన్నా చేరడంతోపాటు బీజేపీకి పలు జిల్లాల అధ్యక్షులుగా ఉన్నవారు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరినీ సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడైన తర్వాత పదవుల నుంచి తొలగించారు. దీనిపై కన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాతోపాటు ఇతర జిల్లాల్లోని బీజేపీ నేతలంతా టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.

బీజేపీ కోసం చివరి వరకు ఎదురు చూపులు
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లడం దాదాపు ఖాయమైన పరిస్థితుల్లో ఈ రెండు పార్టీ బీజేపీని కూడా కలుపుకొని వెళదామని చూస్తున్నాయి. అయితే స్థానిక నాయకత్వం కారణంగా అది సాధ్యపడే అవకాశం కనపడటంలేదంటున్నారు. అయితే పొత్తులు నిర్ణయించాల్సింది ఢిల్లీలోని అధిష్టానం కాబట్టి ఎన్నికల చివరివరకు ఎదురుచూద్దామని చంద్రబాబునాయుడు, (Chandrababu) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నిర్ణయించుకున్నారు. అధికారికంగా ఈ రెండు పార్టీలు పొత్తు గురించి ప్రకటించకపోయినప్పటికీ కొన్నిచోట్ల ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

బీజేపీతో స్నేహం కోరుతున్న చంద్రబాబు
బీజేపీతో మొదటి నుంచి స్నేహం కోరుతున్నారు చంద్రబాబు. అయితే ఢిల్లీ అధిష్టానం ఏ విషయం తేల్చడంలేదు. రెండుసార్లు ప్రధానమంత్రిని కలిసిన చంద్రబాబు విడిగా మాత్రం కలవలేకపోయారు. గత ఎన్నికలకు ముందు బీజేపీపై చంద్రబాబు చేసిన యుద్ధం తెలిసిందే. తిరిగి వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కోవడానికి కేంద్రం సహకారం అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఆ సహకారం బీజేపీ ఎంతవరకు అందిస్తుందనేదే? మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఈలోగా ఏపీలో బీజేపీ నేతలంతా టీడీపీలో చేరడటంవల్ల టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న స్థానిక నాయకత్వం తెలుగుదేశం పార్టీ గురించి అధిష్టానానికి వ్యతిరేకంగానే చెబుతుందికానీ అనుకూలంగా చెప్పదుకదా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో జగన్ ను ఢీకొట్టడానికి బీజేపీ సహకారం కోసం ఎదురుచూస్తుండగా వస్తున్న నాయకులను వద్దని వారించే పరిస్థితి లేదు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. బీజేపీ నుంచి టీడీపీకి చేరికలన్నీ పార్టీని బలోపేతం చేస్తున్నప్పటికీ కేంద్రం దగ్గర బలహీనం చేస్తాయనే విశ్లేషణలు వస్తున్నాయి. చివరకు ఏం జరుగుతుందో చూడాలి మరి.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications