దూకుడు పెంచిన జగన్- మరో సీనియర్ నేతపై వేటు: ఉపేక్షించే ప్రసక్తే లేదిక..!!
అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత శరగడం చిన అప్పల నాయుడిని పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
అనకాపల్లి: వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ ఎన్నికలను గెలిస్తే మరో 30 సంవత్సరాల పాటు తిరుగు ఉండదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తోన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక, కఠిన నిర్ణయాలను తీసుకుంటోన్నారు. అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన రాజీపడట్లేదు.

వ్యతిరేక కార్యకలాపాలపై..
నియోజకవర్గ స్థాయిలో చాపకింద నీరులా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని వైఎస్ జగన్ ఏ మాత్రం ఉపేక్షించట్లేదు. ఈ విషయంలో ఆయన ఏ మాత్రం రాజీధోరణిని ప్రదర్శించట్లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సైతం వేటు వేయడానికి వెనుకాడట్లేదాయన. ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల వ్యవహారంలో వైఎస్ జగన్ ఎంత కఠినంగా వ్యవహరించారనేది తెలిసిన విషయమే. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తోన్న సీనియర్లను సైతం పక్కనపెడుతున్నారు.

ప్రజల నుంచి నేరుగా..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా ప్రజల నుంచి నేరుగా అందే ఫీడ్‌బ్యాక్‌ను వైఎస్ జగన్ దీనికి ప్రాతిపదికగా తీసుకుంటోన్నారు. ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేయడానికి, పరిపాలన- సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయాలను సేకరించడానికి గడప గడపకూ మన ప్రభుత్వం ఉపయోగపడుతోంది. భవిష్యత్‌లో వాటి ఆధారంగానే టికెట్లను కేటాయించే అవకాశాలు లేకపోలేదు.

ఆ ఫీడ్ బ్యాక్ తోనే..
గడప గడపకూ మన ప్రభుత్వం నుంచి అందుతున్న ఫీడ్ బ్యాక్ ను ఆధారంగా చేసుకుని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న నాయకులపై చర్యలకు దిగుతున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఇప్పటికే కొరడా ఝుళిపించారు వైఎస్ జగన్.

అనకాపల్లి జిల్లా..
ఇప్పుడు తాజాగా అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు శరగడం చిన అప్పలనాయుడిపై చర్యలు తీసుకున్నారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు శరగడం చిన అప్పలనాయుడిని సస్పెండ్ చేసినట్లు తెలిపింది.

కారణం.. ఇదే..
నియోజకవర్గం స్థాయిలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆయన పాల్పడుతున్నందున ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వైసీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఆయనపై ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలించి- నిజనిజాలను తెలుసుకున్న తరువాతే క్రమ శిక్షణ కమిటీ చేసిన సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ఇకపై శరగడంతో పార్టీకి ఎలాంటి సంబంధాలు ఉండవని పేర్కొంది. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
విశాఖ-ఢిల్లీ ఇండిగో ఫ్లైట్ లో తీవ్ర సాంకేతిక లోపం -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications