నా గదికి రా-సంచలన ఆడియో-నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ కీచక పర్వం-వైద్య విద్యార్థినికి వేధింపులు
కోవిడ్ విధుల్లో ఉన్న ఓ వైద్య విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఓ ఉన్నత వైద్యాధికారి కీచకపర్వం బయటపడింది. అతని వేధింపులను నిలదీస్తూ ఆ వైద్య విద్యార్థిని ఎదురు తిరగడంతో అతని నోట మాట లేకుండా పోయింది. దీనికి సంబంధించిన సంచలన ఆడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కూతురు వయసు ఉన్న ఆమె పట్ల ఆ వైద్యాధికారి వేధింపులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

'మీకేమీ అసభ్యంగా అనిపించట్లేదా'
నెల్లూరు జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వైద్య విద్యార్థిని ఆయనపై ఎదురు తిరిగింది. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సదరు సూపరింటెండెంట్ తనను ఎలా వేధించింది ఆ సంభాషణలో బాధితురాలు వెల్లడించింది.
'సార్.. మీకేమీ అసభ్యంగా అనిపించట్లేదా... ఒక స్టూడెంట్‌తో అలా ఎలా మాట్లాడుతారు. నన్ను కారెక్కించుకుని పక్కకు తీసుకెళ్లాల్సిన అవసరమేంటి... నా వయసు 23... నాకు తెలిసి మీ పిల్లలు కూడా అంతే వయసు ఉండి ఉంటారు... రోజూ డ్యూటీ అయిపోయాక మీకు కాల్ చేయాలా... బయట కలవమని, రెస్టారెంట్లు,బీచ్‌లకు రావాలని ఎలా అడుగుతారు. నా స్థానంలో ఇంకొకరు ఉంటే దీన్ని పెద్ద ఇష్యూ చేసేవాళ్లు.
మా పేరెంట్స్ దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్లు టెన్షన్ పడుతారని చెప్పట్లేదు.' అని ఆ వైద్య విద్యార్థిని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఏసీ లేదని గదికి రమ్మంటారా...?'
'నీ రూమ్‌లో ఏసీ లేదు కదా నా గదికి రా అన్నారు. ఫోన్ నంబర్ బ్లాక్ చేస్తే ఇంకో నంబర్ నుంచి ఫోన్ చేసి వేధిస్తున్నారు. మీ వయసుకు నాతో చెప్పించుకుంటారా... రెండు నెలల నుంచి మీ కారణంగా మానసికంగా కుమిలిపోతున్నాను. ఎప్పుడు అంటారు కదా ఫోన్ చేసి మాట్లాడు మాట్లాడు అని.. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నా. మీరు చేసి చిన్న తప్పు అనుకుంటున్నారా... చాలా డిస్టర్బ్ చేశారు... ఇంకొకరైతే ఇష్టమొచ్చినట్లు మాట్లాడేవారు. అప్పటికీ నేను మర్యాదగానే డీల్ చేశా.' అని బాధితురాలు తన ఆవేదన వ్యక్తం చేశారు.
Recommended Video

'సార్ ఇక ఆపేయండి...'
'ఏమన్నారు... నా చేతులు కట్ చేసి... ప్లాస్టర్ వేసి కారులో వేసుకుని వెళ్లిపోతారా... నన్నే కాదు... ఇంకో ఇద్దరు,ముగ్గురిని కూడా మీరిలాగే వేధిస్తున్నారని తెలిసింది. నేనేమైనా రోడ్ సైడ్ రోమియోనా... నన్నెందుకు దూరం పెడుతున్నావని అడిగారు... వాళ్లయినా బెటర్... ఒక కామెంట్ చేసి వెళ్లిపోతారు. సిగ్గుందా అని నిలదీయగలం. కానీ మీ వయసేంటి... కేవలం మంచి దుస్తులు వేసుకున్నంత మాత్రాన డిగ్నిటీ రాదు.
మీ కూతురితో 55-60ఏళ్లు ఉన్న వ్యక్తి ఇలాగే అసభ్యంగా ప్రవర్తిస్తే మీకేమీ అనిపించదా...తీసుకెళ్లి పెళ్లి చేస్తారా... పక్కనవాళ్ల కూతురైతే ఇలా చేస్తారా... పైగా ఇవన్నీ కామన్ అని అంటున్నారు... సార్ ఆపేయండి ఇక... నాతోనే కాదు ఎవరితోనూ ఇలా చేయకండి...' అని ఆ వైద్య విద్యార్థిని వాపోయింది. ఆమె మాట్లాడుతున్నంత సేపు... సదరు సూపరింటెండెంట్... అయిపోయింది కదా... నేనేమీ అనట్లేదు కదా.. అంటూ నిర్లక్ష్యంగా బదులివ్వడం గమనార్హం. ఈ ఆడియో టేపు బయటకు రావడంతో సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications