వాలంటీర్లపై టీడీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాలంటీర్ల చూపించిందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. వైసీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా నిలుస్తారని చెప్పి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లకు ఎటువంటి బాధ్యతలు అప్పగించవద్దని ఆదేశించింది.
టీడీపీ ఫిర్యాదుతోనే ఈసీ అంక్షలు విధించిందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తోందని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈసీ అంక్షలు విధించడంతో పలువురు వాలంటీర్లు పదవులకు రాజీనామాలు చేసి వైసీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో వాలంటీర్లు మాట మార్చేశారు. వైసీపీ నేతలు కొందరు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు కోరుతున్నారు.

తాజాగా దీనిపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. ఆయన మీడియాతో రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని క్లారిటీ ఆయన ఇచ్చారు. కానీ ఎన్నికల సమయంలో ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోబోమని మంత్రి తేల్చి చెప్పారు. రాజీనామా చేయకుండా ఉద్యోగంలో ఉన్న వాలంటీర్లతో పని చేయించుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రాజీనామా చేసిన వాలంటీర్లు వైసీపీ సానుభూతిపరులనే ఆరోపణల నేపథ్యంలో వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకొవద్దనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications