అనుమానం వస్తే చంపేశాడు: వరుస హత్యల కేసులో నిందితుడి అరెస్ట్

పశ్చిమగోదావరి: జిల్లాలో వరుస హత్యలకు పాల్పడుతున్న నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక హత్య చేసి.. దాని నుంచి తప్పించుకోవడానికి మరో హత్య చేశాడు. ఆ తర్వాత మరో హత్య. ఇలా ఒకదాని వెంట మరొకటి 4 రోజుల్లో నలుగుర్ని హత్య చేశాడు ఈ కిరాతకుడు. విస్తృతంగా గాలించిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

పశ్చిమగోదావరి జిల్లా ఎస్పి భాస్కరభూషణ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన చిన్నబత్తిన కరుణాకర్(33) తన భార్య, కుమారుడితో పాటు మరో ఇద్దరు మహిళలను హత్య చేశాడు. నవంబర్ 1న జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం సమీపంలో తన కుమారుడు విజయ్‌కుమార్ (14)ను చంపిన కరుణాకర్, ఆ బాలుడి మృతదేహాన్ని కాలువలో పడేసి పరారయ్యాడు.

అతడ్ని అరెస్ట్ చేసి విచారించగా, గతంలో చేసిన మరో మూడు హత్యలు చేసినట్లు అంగీకరించాడని ఎస్పీ చెప్పారు. తన భార్య నీలిమ వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో కరుణాకర్ 2010లో ఆమెను హైదరాబాద్‌లో తాను నివాసముండే ఇంట్లోనే హత్య చేశాడని తెలిపారు. ఆమెది హఠాన్మరణంగా అక్కడి వారిని నమ్మించి కేసు లేకుండా తప్పించుకున్నాడన్నారు.

అనంతరం తన ఇద్దరు కుమారులు విజయ్‌కుమార్, అజయ్‌కుమార్‌లతో రాజమండ్రి వచ్చి నివాసం ఉంటున్నాడు. 'రాజమండ్రికి చెందిన సోనీ, పార్వతి అనే ఇద్దరు మహిళలతో కరుణాకర్ వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. ఇదిలావుండగా, సోనీ అనే మహిళ తన పెద్ద కొడుకు విజయ్‌కుమార్‌తో సంబంధం పెట్టుకుందని అనుమానించి ఆమెను రాజానగరం సమీపంలో హత్యచేశాడు.

Serial killer arrested in West Godavari district

ఈ హత్య విషయాన్ని అతడి పెద్దకొడుకు విజయ్‌కుమార్.. పార్వతికి చెప్పాడు. దీంతో ఆమె కరుణాకర్‌ను నిలదీసింది. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దన్న కరుణాకర్ ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. నెలలు గడిచిపోతున్నా నిందితుడు పెళ్లిమాట ఎత్తక పోవడంతో పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో పార్వతిని అక్టోబర్ 13న సోనీని హత్య చేసిన చోటకు తీసుకెళ్లి హతమార్చాడు.

విషయాలన్నీ తెలిసిన పెద్దకొడుకు విజయ్‌కుమార్ వల్ల ఎప్పటికైనా ముప్పు తప్పదనే ఉద్దేశంతో అతడిని చంపి దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద కాలువలో పడేశాడు. కగా, కొవ్వూరు రూరల్ సీఐ సుబ్బారావు ఆదివారం దేవరపల్లి సెంటర్‌లో వాహనాలను తనిఖీ చేస్తుండగా నిందితుడు కరుణాకర్ పట్టబడ్డాడని ఎస్పీ తెలిపారు.

మీడియా సమావేశంలో కొవ్వూరు డిఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, ఎస్‌బి డిఎస్పీ భాస్కరరావు, కొవ్వూరు రూరల్ సిఐ సుబ్బారావు, స్పెషల్ బ్రాంచి సిఐ రాంబాబు, ఎస్ఐ సుధాకర్ పాల్గొన్నారు. కాగా, నిందితుడి నుంచి రెండు సెల్ ఫోన్లు, హత్యలకు వినియోగించిన వస్త్రాలు, కొన్ని ప్లాస్టిక్ ట్యాగ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+