వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి వాదన: ఎన్‌కౌంటర్ మృతులు వీరప్పన్ ముఠా సభ్యులట

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శేషాచలం అడవుల్లో పోలీసు, అటవీ సిబ్బందిపై దాడికి దిగి, ఎదురుకాల్పుల్లో మరణించిన ఎర్రచందనం దొంగలు వీరప్పన్‌ ముఠా సభ్యులేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు కేంద్రానికి వివరించినట్లు తెలిసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్‌.సి.గోయల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 7న తిరుపతి సమీపంలో ఎన్‌కౌంటర్‌పై సుదీర్ఘ చర్చ సాగినట్లు గురువారం మీడియాలో వార్తలు వచ్చాయి.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌ నివారణకు చేపట్టిన చర్యలు, ఇతర అంశాల్ని ఐవైఆర్‌ ఆయనకు వివరించారు. అడవి దొంగ వీరప్పన్‌ హతమైన తర్వాత అతడి ముఠాలోని సభ్యులు తమ అడవుల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నట్లు ఏపీ పోలీసులు తమిళనాడు పోలీసుశాఖకు తెలియజేసినట్లు చెప్పారని తెలిసింది. ఎదురుకాల్పులపై హోంశాఖ కార్యదర్శికి ప్రత్యేక నివేదికేదీ సీఎస్‌ అందజేయలేదని తెలిసింది.

కాగా, ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలకా చంద్రశేఖర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ మీద బుధవారం హైకోర్టులో విచారణ సాగింది. మృతుల పోస్టుమార్టం, ఇంక్వెస్ట్‌ నివేదికలను గురువారం అందజేయాలని చీఫ్‌ జస్టిస్‌ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్‌ పి.వి.సంజయ్‌ కుమార్‌ల ధర్మాసనం ఈ సందర్భంగా అదనపు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ను ఆదేశించింది.

Seshachalam encounter: AP says coolies are Veerappan followers

ఎన్‌కౌంటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మునియమ్మాళ్‌ (మృతుడు శశికుమార్‌ భార్య) కూడా ధర్మాసనం ఆదేశాల మేరకు కోర్టుకు హాజరయ్యారు. ఆమె తరపున తమిళనాడు న్యాయవాదులు అఫిడవిట్‌ సమర్పించి, మృతదేహాలకు రీ-పోస్టుమార్టం కోసం ఆదేశించాలని కోరారు. అయితే, వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత తాము పరిశీలిస్తామని ఈ సందర్భంగా సీజే చెప్పారు.

ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు ఏజీ తెలుపగా అందులో సభ్యులెవరో వెల్లడించాలని కోరారు. ఈ వివరాలను వచ్చే సోమ, మంగళవారాల్లో తెలియజేస్తామని ఆయన బదులిచ్చారు. పోస్టుమార్టం నివేదికల గురించి అదనపు ఏజీని ప్రశ్నించారు. సోమవారం ఇస్తామని ఆయన చెప్పగా, ఎన్‌కౌంటర్‌పై ‘ఇంక్వెస్ట్‌ నివేదిక, పోస్టుమార్టం నివేదికలను గురువారం తమ ముందుంచాలని ఆదేశించారు.

మునియమ్మాళ్‌ ఫిర్యాదుపై నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలను ఆమె న్యాయవాదికి ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదావేశారు. కాగా, మునియమ్మాళ్‌ ఫిర్యాదు మేరకు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు
చేశారు.

English summary
According to reports - Andhra Pradesh CS Krishna Rao briefed to the Centre about Seshachalam encounter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X