మంత్రి రోజాపై కంగనా షాకింగ్ కామెంట్స్ - అలాంటి వారున్నారా..!!
ఏపీ మంత్రి రోజా పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రముఖ నటిగా, ఏపీ మంత్రిగా ఉన్న రోజా గురించి కంగనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనకు రాజకీయాల్లో వచ్చే అవకాశం వస్తే వదులుకోనని కంగనా స్పష్టం చేసారు. సినీ నటులు రాజకీయాల్లో కొనసాగటం పైన కంగనా స్పందించారు. ఇదే సమయంలో ఏపీ మంత్రి రోజా జనసేనాని పవన్ పైన చేసిన వ్యాఖ్యలపైన కంగనా కామెంట్స్ సినీ, పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు కారణమయ్యాయి.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనోత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలకు చిరునామాగా నిలిచారు. కందన సినిమాల కంటే కాంట్రవర్సీ కామెంట్స్ తోనే ఎక్కువగా చర్చల్లో నిలుస్తారు. ప్రస్తుతం కంగన చంద్రముఖి 2 లో నటిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార కాంబినేషన్లో వచ్చిన చంద్రముఖి సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన పి వాసు ఇప్పుడు సీక్వెల్ తీసుకొస్తున్నారు. ఇందులో రాఘవా లారెన్స్ ప్రధాన పాత్రలో పోషిస్తుండగా చంద్రముఖి పాత్రను రంగనా పోషిస్తున్నారు. ఈనెల 15న చంద్రముఖి 2 తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో కంగనా రనౌత్ మీడియాతో మాట్లాడారు.

తాను భారత్ అంశం గురించి రెండేళ్ల క్రితమే ప్రస్తావించానని గుర్తు చేశారు. రాజకీయాల్లో అవకాశము వస్తే వదులుకోనని స్పష్టం చేశారు. తాను దేశ భక్తురాలినని, అందుకే తనవంతుగా పేదలకు తోచిన సాయం చేస్తున్నానని తెలిపారు. రాజకీయాల్లోకి వస్తే సినిమాలు వదులుకోవాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఏపీ పర్యాటకశాఖ మంత్రి, నటి రోజా చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా.. ''రోజా అంటే ఎవరు? అలాంటివారు ఉన్నారన్న విషయమే నాకు తెలియదు. ఆమె గురించి నేనేం మాట్లాడతానని కంగనా ప్రశ్నించారు. దీంతో, ఇప్పుడు కంగనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. ఈ వ్యాఖ్యలపైన రోజా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.












Click it and Unblock the Notifications