జగన్ సర్కార్ కు షాక్ ! రుషికొండ కమిటీ నుంచి ఏపీ అధికారుల అవుట్-హైకోర్టు కీలక ఆదేశం..
ఏపీలో విశాఖపట్నం రుషికొండ తవ్వకాల కేసులో వైసీపీ సర్కార్ కు ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రుషికొండ తవ్వకాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. విచారణ కోసం ఐదుగురు సభ్యుల కేంద్ర ప్రభుత్వ కమిటీ నియామకానికి ఆదేశాలు ఇచ్చింది. అయితే కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ముగ్గురిని ఇందులో నియమించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఇవాళ వారిని తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
రుషికొండ తవ్వకాలపై నియమించిన కమిటీలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ముగ్గురు అధికారులు ఉండటంపై నిన్న విచారణలో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. దీన్ని చూస్తుంటే కేంద్రం, రాష్ట్రం కుమ్మక్కైనట్లు భావిస్తున్నట్లు తెలిపింది. దీనిపై ఇవాళ మరోసారి విచారణ జరిపిన హైకోర్టు సదరు ముగ్గురు అధికారుల్నివిచారణ కమిటీ నుంచి తప్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఐదుగురు కేంద్ర ప్రభుత్వ అధికారుల కమిటీ రుషికొండ తవ్వకాలపై విచారణ జరపాల్సి ఉంటుంది.

రుషికొండ అక్రమ తవ్వకాలపై విచారణ కమిటీలో ఏపీ అధికారుల్ని నియమించడంపై పిటిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యలో ఇవాళ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర సర్వేకు నియమించే బృందంలో ఉన్న ముగ్గురు రాష్ట్ర అధికారులను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర శాఖల అధికారులతో ఐదుగురు సభ్యులను నియమించాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అక్రమ తవ్వకాలను నిగ్గు తేల్చేందుకు సమగ్ర సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది. జనవరి 31 లోపు నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే కొత్త అధికారుల కమిటీ వివరాలు హైకోర్టుకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications