Borugadda:బోరుగడ్డ అనిల్ కు హైకోర్టు బిగ్ షాక్..! మీకు ఇదే పనా..?
ఏపీలో వైసీపీ సానుభూతిపరుడిగా పేరున్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతలపై వీడియోలతో రెచ్చిపోయిన ఆయన సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనకు చుక్కలు కనిపిస్తున్నాయి. అప్పట్లో పెట్టిన సోషల్ మీడియా పోస్టులు, వీడియోలపై రాష్ట్రంలో పలు చోట్ల కేసులు నమోదు కావడంతో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ఇవాళ మరో షాక్ తగిలింది.

గతంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వ్యవహారంలో అనంతపురంలో దాఖలైన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బోరుగడ్డ అనిల్ కుమార్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రస్తుతం బోరుగడ్డ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అలాగే పోలీసులు గతంలో బోరుగడ్డను ఇదే కేసులో అనంతపురం పీఎస్ లో కస్టడీకి కూడా తీసుకుని విచారణ చేశారు. ఈ నేపథ్యంలో బోరుగడ్డ తనకు ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే బోరుగడ్డకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నో చెప్పింది.
బోరుగడ్డ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడు బోరుగడ్డ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఇలాంటి వాళ్లను క్షమించే ప్రశ్నే లేదని వ్యాఖ్యానించింది. అదే సమయంలో పోలీసులు కూడా బోరుగడ్డపై ఇప్పటికే దాఖలైన పలు కేసుల్లో ఛార్జిషీట్లు కూడా దాఖలై ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ఆధారాలను పరిశీలించిన హైకోర్టు.. బోరుగడ్డ అనిల్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో బోరుగడ్డ మరింత కాలం జైల్లోనే ఉండాల్సిన పరిస్ధితి.
ఇప్పటికే బోరుగడ్డపై నమోదైన పలు కేసుల్లో పోలీసులు ఛార్జిషీట్లు దాఖలు చేస్తున్నారు. దీంతో బోరుగడ్డకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ఇవన్నీ దాదాపు ఒకే తరహా కేసులే. వీటిపై బోరుగడ్డ క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేయకుండా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో హైకోర్టు బెయిల్ ను తిరస్కరించింది.












Click it and Unblock the Notifications