పాముతో బెదిరించి బట్టలిప్పేసి గ్యాంగ్ రేప్, చిత్రీకరణ
హైదరాబాద్: ఢిల్లీలో నిర్భయ రేప్ ఘటనను మరిపించే అత్యంత దుర్మార్గమైన ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతం పహాడీషరిఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
శంషాబాద్ ఏసిపి సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం గత నెల 31న సరూర్‌నగర్ మండలం షాహిన్‌నగర్‌లోని ఒక ఫామ్‌హౌజ్‌కు ఇద్దరు ప్రేమికులు సరాదాగా వచ్చారు. ప్రేమజంటను గమనించిన స్థానిక యువకులు ప్రేమికుడిని బంధించి, అతన్ని మోకాళ్లపై కూర్చోబెట్టి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ముందు పాముతో బెదిరించి వివస్తన్రు చేసి, సాముహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచార ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. పోలీసులకుగాని, ఇంకెవరికైనా విషయాన్ని చెబితే, చిత్రీకరించిన దృశ్యాలను సోషల్ నెట్‌వర్క్‌లో అప్‌లోడ్ చేస్తామని బెదిరించారు.
బాధిత జంట ఆలస్యంగానైనా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పటివరకూ ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు ఏసిపి చెప్పారు. పహడీషరీఫ్ పోలీసులు ప్రధాన నిందితుడు ఫైసల్‌తో పాటు సాలం హమ్దీ అరెస్టయివారిలో ఉన్నారు.
ఫామ్‌హౌస్‌లో ఆగిన ప్రేమ జంటను గమనించిన ఖాదర్ బారక్బా, ఖాజా అహ్మద్ తమ మిత్రులు ఫైసల్ దయానీ, తయ్యబ్ బసలమా, మహ్మద్ ఫర్హాన్, సయ్యద్ అన్వర్, అలీ బారక్బాలను పిలిచి, గోడ దూకి ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించారు. అడ్డుకోబోయిన వాచ్‌మన్‌ను మూర్ఛపోయేలా కొట్టారు.












Click it and Unblock the Notifications