రైలు ప్రమాదం:మృతులు వీరే, ఒకే ఫ్యామిలీలో ముగ్గురు

ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. బీహార్‌లోని ఔరంగాబాద్‌కు చెందిన మనోజ్ కుమార్ తన కుటుంబంతో కలిసి బెంగళూరు నుంచి ఔరంగాబాద్‌కు వెళ్తున్నాడు.
ఈ దుర్ఘటనలో ఆయన భార్య శ్వేతా సింగ్ (33), శౌర్య (2), సంహిత కుమారి (10) మృతి చెందారు. ఆయన బోరున విలపించాడు. మృతుల్లో తారా దేవి (34), కార్తీక్ సాహు (70), లోకేంద్ర కుమార్ (28), సందీప్ సింగ్, అలెక్సెస్ తాప్నోలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతులు, బీహార్, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, బొబ్బిలికి చెందిన వారు.
వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
విజయనగరం జిల్లా రైలు ప్రమాదం వివరాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఫోన్‌లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలిపేందుకు టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. కాగా ప్రమాద సంఘటన స్థలాన్ని స్థానిక ఎంపి బొత్స ఝాన్సీ, కలెక్టర్ కాంతిలాల్ దండేలు పరిశీలించారు.












Click it and Unblock the Notifications