బాలికపై అత్యాచారం: భర్తపై గొడ్డలితో దాడి చేసిన భార్య
హైదరాబాద్: సికింద్రాబాదులోని చిలకలగూడ పోలీసుస్టేషను పరిధిలో గల పార్శీగుట్టలో ఏడేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మల్కాజ్‌గిరిలో చోటుచేసుకుంది. ముఠా సభ్యుల నుంచి రూ. లక్షన్నర విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భర్తపై భార్య గొడ్డలితో దాడి చేసింది. భర్త పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications