తిరుపతి ప్రజలకు గుడ్ న్యూస్, స్వర్ణముఖీ నది తీరంలో రీచ్ లు, చంద్రబాబు డిసైడ్
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుకు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ప్రజలకు విక్రయించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ ధరకు ఇసుక అందుబాటులో ఉంటుందని ఇప్పటికే సీఎం చంద్రబాబు చెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక వ్యాపారం చేసిన వారికి కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి సమీపంలోని చంద్రగిరిలో ఇసుక రీచ్ లో ఏర్పాటు చేయడానికి సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. చంద్రగిరి మండలంలోని నాగయ్య గారి పల్లె, శానంబట్ల ప్రాంతాల్లో ఇసుక రీచ్ లో ఏర్పాటు చేయడానికి పలు ప్రాంతాలను సంబందిత అధికారులు ఇప్పటికే రెండు మూడుసార్లు పరిశీలించారు.

స్వర్ణముఖి నది తీర ప్రాంతాల్లో ఇసుక రీచ్ లు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అని అధికారులు చర్చలు జరిపారు. గత వైసీపీ ప్రభుత్వం లో స్వర్ణముఖి నదిలోనే ఇసుకను అడ్డంగా దోచుకుని తిరుపతి, చిత్తూరు, వేలూరు, చెన్నై బెంగళూరు ప్రాంతాలకు అక్రమంగా తరలించారని ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్, ఆర్ డబ్ల్యు, ఎంపీడీవో, ఎస్ఈబీ అధికారులు ఇసుక రీచ్ లు ఏర్పాటు చెయ్యడాికి పలు ప్రాంతాలు పరిశీలించారు.
స్వర్ణముఖి నది తీర ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలను పరిశీలించిన అధికారులు త్వరలో ఇసుక రీచ్ లో ఏర్పాటు చేస్తామని అంటున్నారు. అయితే శానంబట్ల ప్రాంతంలో ఇసుక రీచ్ లు ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతం కాదని అధికారులు ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. చంద్రగిరి మండలం లో ఇసుక రీచ్ లో ఏర్పాటు చేస్తే తక్కువ ధరకు ఇసుక తీసుకోవడానికి తిరుపతి ప్రజలకు అనువుగా ఉంటుందని సమాచారం.
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, సీనియర్ అధికారులతో చర్చించి త్వరలో ఇసుక రీచ్ లు ఏర్పాటు చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. మొత్తం మీద స్వర్ణముఖి నది తీరంలో ఇసుక రీచ్ లు ఏర్పాటు చెయ్యడానికి పలు ప్రాంతాలు పరిశీలించిన అధికారులు చకచకా పనులు వేగవంతం చేస్తున్నారు. ఇసుక రీచ్ ల ఏర్పాటు అనువైన ప్రాంతాలు ఎంపికచేసి తరువాత తిరుపతి జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ, మైనింగ్ శాఖ అధికారులకు నివేదిక అందించి తరువాత ఇసుక రీచ్ లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారని తెలిసింది.












Click it and Unblock the Notifications