తిరుపతి పోలీసులకు షాక్, దెబ్బకు ఎక్కడికో, వైసీపీ లీడర్స్ తో !!

మాజీ సీఎం జగన్ పర్యటన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన సమయంలో తిరుపతి పోలీసు అధికారులకు షాక్ తగిలింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పోలీసు అధికారులు ఒకేసారి బదిలీ కావడం తీవ్రచర్చకు దారి తీసింది. కొందరు పోలీసు అధికారులను వీఆర్ కు పంపిస్తు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని చాలా మంది సీఐలను ఒకేరోజు బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది.

గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆ పార్టీ నేతలకి సహకరించారని ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు బదిలీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్లిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు.

Several police officers were transferred in Tirupati and Chittoor districts

ఐపీఎస్ అధికారులతో పాటు ఎసీపీలు, డీఎస్పీలు, సీఐెలు, ఎస్ఐలు బదిలీ అయ్యారు. నెల రోజుల క్రితమే తిరుపతిలో పలువురు పోలీసు అధికారులు బదిలీ అయ్యారు. రెండు వారాల క్రితం తిరుపతికి చెందిన సీనియర్ పోలీసు అధికారులకి పదోన్నతులు కల్పించి వారిని అదే ప్రాంతంలోని వివిధ విభాగాలకు బదిలీ చేశారు. గత నెలలో తిరుపతి జిల్లా చెందిన పలువురు సీఐలు, ఎస్ఐలు ఒకే సారి వివిద ప్రాంతాలకు బదిలీ అయ్యారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీఎస్పీలు బదిలీ అయ్యారు. అయితే మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు తిరుపతిలోని పోలీసులకు ఝలక్ ఇచ్చారు. తిరుపతిలో పని చేస్తున్న పలువరు సీఐలను బదిలీ చేసి వారిని వేరే ప్రాంతాలకు బదిలి చేశారు. ఓ ప్రాంతానికి చెందిన సీఐలు మరో ప్రాంతానికి బదిలీ అయ్యారు. తిరుపతి జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలోని సీఐలకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వారిని వీఆర్ కు పంపించారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో టీడీపీ నాయకుల్ని ఇబ్బందులకు గురిచేసిన పోలీసు అధికారులకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్ లో పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+