ఏపీలో వెయిటింగ్ ఐపీఎస్ ల మరో ధిక్కారం..! సర్కార్ కు షాక్..

ఏపీలో ఐపీఎస్ అధికారులకూ, ప్రభుత్వానికీ మధ్య సాగుతున్న పోరు మరో మలుపు తిరుగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో విపక్షాలను టార్గెట్ చేసిన పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు చంద్రబాబు సర్కార్ పోస్టింగ్ లు ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచింది. అదే సమయంలో వారు బెంగళూరు వెళ్లి జగన్ ను కలిశారన్న ఆరోపణలు రావడంతో రెగ్యులర్ గా డీజీపీగా కార్యాలయానికి వచ్చి హాజరు నమోదు చేసి వెళ్లాలని మెమో ఇచ్చింది. అయితే దీన్నీ సదరు ఐపీఎస్ లు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసిన ఐపీఎస్ బదిలీల తర్వాత 16 మంది అధికారులకు పోస్టింగ్ లు దక్కలేదు. వీరందరినీ తొలుత అలాగే వదిలేద్దామని భావించిన ప్రభుత్వం.. మధ్యలో జగన్ ను కలిశారన్న వార్తల నేపథ్యంలో రోజూ డీజీపీ ఆఫీసుకు వచ్చి హాజరు నమోదు చేసి సాయంత్రం వరకూ ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే దీన్ని కూడా కొందరు అధికారులు ధిక్కరిస్తున్నట్లు తెలుస్తోంది. డీజీపీ ఆదేశాలను కూడా వీరు లెక్క చేయని పరిస్ధితి ఉండటంతో ప్రభుత్వానికి వీరిని ఏం చేయాలో మింగుడుపడటం లేదు.

several waiting ips officers in ap defy state dgp s memo setback to government

ఇలా డీజీపీ ఆదేశాలను ధిక్కరించి రోజూ ఆఫీసుకు రాని వారిలో సీనియర్ ఐపీఎస్ లు సీతారామాంజనేయులు, పీవీ సునీల్ కుమార్, విశాల్ గున్ని, కేకేఎన్ అన్బురాజన్, తిరుమలేశ్వర్ రెడ్డి, సిద్ధార్ద్ కౌశల్, మేరీ ప్రశాంతి, జీఆర్ రాధిక వంటి వారు ఉన్నట్లు సమాచారం. వీరిలో కొందరు సెలవులు తీసుకుని ఆ తర్వాత వస్తుంటే, మరికొందరు మొత్తంగా డీజీపీ ఆఫీసువైపే చూడటం లేదు. దీంతో వీరి విషయంలో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోబోతోందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+