శారీరకంగా కలిస్తే దైవానుగ్రహమట: వ్యక్తి అరెస్టు
విజయనగరం: విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో ఒక వర్గానికి చెందిన ఆశ్రమంలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ చేసిన ఫిర్యాదు మేరకు విజయనగరం డిఎస్‌పి శ్రీనివాసరావు, సిసిఎస్ డిఎస్‌పి చక్రవర్తి ఆధ్వర్యంలో కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేసి ఆశ్రమ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.
కొత్తవలస జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్‌కు ఎదురుగా భారీవ్యయంతో ఐదేళ్ల క్రితం నిర్మించిన ఈ ఆశ్రమానికి మతగురువుగా వ్యవహరిస్తున్న డి దయానందసాగర్ మతప్రచారం పేరుతో కొందరు మహిళలను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. విశాఖలో నివాసం ఉంటున్న దయానందసాగర్ కొత్తవలసలో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. విశాఖపట్టణానికి చెందిన ఒక మహిళ గురువారం రాత్రి ఆశ్రమానికి వచ్చింది.

కానీ కొద్ది సేపటికే ఆమె బయటకు వచ్చి తనతో శారీరకంగా కలిస్తే దైవం అనుగ్రహిస్తుందని, స్వర్గానికి వెళ్లవచ్చనని మతగురువు దయానందసాగర్ బలవంతం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొత్తవలస పోలీసులు గురువారం రాత్రే మతగురువును అదుపులోకి తీసుకున్నా, విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. విషయం తెలిసి శుక్రవారం మధ్యాహ్నం డిఎస్పీలు శ్రీనివాసరావు, చక్రవర్తి విజయనగరం నుంచి కొత్తవలస వచ్చి మతగురువు దయానందసాగర్‌ను విచారించారు.
ప్రాథమిక విచారణ అనంతరం దయానందసాగర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదుచేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని డిఎస్పీ శ్రీనివాసరావుతెలిపారు. ఇటీవల కాలంలో కొంతమంది సిబ్బందిని పనిలోనుంచి తొలగించామని, వీరంతా కలసి కుట్ర చేసి దయానందసాగర్‌పై తప్పుడు ఆరోపణలు చేసారని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు.












Click it and Unblock the Notifications