మహిళపై లైంగిక వేదింపులు, చితకబాదిన స్థానికులు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటావారిగూడెంలో కొబ్బరితోటలో కూలీపని చేస్తున్న మహిళపై గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు సామూహిక లైంగిక దాడికి యత్నిం చారు.

ఘంటావారిగూడెంకు చెందిన వెజ్జు సుబ్బారావుకు చెందిన కొబ్బరితోటలో ఓ జంట నివాసముంటూ కూలిపనులు చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మద్యం తాగి గేటు దూకి తోటలోకి వచ్చారు. ఈ సమయంలో తన భర్త లేడని, ఇదే అదనుగా ముగ్గురు యువకులు తనను తాడుతో బంధించి అత్యాచారం చేయబోయారని బాధితురాలు ఆరోపిస్తోంది.

 sexual harassment on lady in Westgodavari district

తాను కేకలు వేయడంతో తన భర్త వచ్చి అడ్డుపడగా అతడినీ గాయపర్చారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాము అరవడంతో స్థానికులు వచ్చి యువకులను పట్టుకున్నారని చెప్పింది.

పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె చె బుతుండగా కొందరు వచ్చి ఆమెను మాట్లాడకుండా కట్టడి చేశారు. దీనిపై అనంతపల్లి ఎస్సై వి.చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఆమె ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని విచారణ చేశామని సామూహిక అత్యాచారం అన్నది వాస్తవం కాదన్నారు. మ ద్యం తాగిన యువకులు గలాటా చేసినట్టు గుర్తించామన్నా రు.

వారిని అదుపులోకి తీసుకుని న్యూసెన్స్‌ కేసు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. అయితే రాత్రి 9 గంటల సమయంలో కూడా కేసు నమోదుకాలేదు. యువకులను తోట యజమానులు గట్టిగా కొట్టడం, వారు తిరిగి తమపై కేసుపెడతారన్న కారణంగానే ఏమీ జరగనట్టు చెప్పాలని బాధిత మహిళపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A lady complaint against three persons for sexual harassment in Ananthapalli police station.police enquiry on this incident.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి