ఏం తేలుతుందో?: శాడిస్ట్ భర్త రాజేష్‌కు నేడే అసలు 'పరీక్ష'.. ఆ రిపోర్టు పైనే అంతా!
చిత్తూరు: నవవధువు శైలజపై దాడిచేసి దారుణంగా హింసించిన కేసులో నిందితుడు రాజేశ్‌కు మంగళవారం లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించనున్నారు. గత బుధవారం కోర్టు ఇందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
Recommended Video

తొలిరాత్రే తన నపుంసకత్వాన్ని బయటపెట్టుకుని.. ఆపై భార్యను చిత్రహింసలు పెట్టిన రాజేష్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పటివరకు రాజేష్ మాత్రం తాను నపుంసకుడిని అని ఎక్కడా చెప్పలేదు. దీంతో లైంగిక పటుత్వ పరీక్షల ద్వారానే అసలు నిజాలను నిగ్గు తేల్చాలని పోలీసులు భావించారు.

సెక్సాలజిస్టుల వాదన?
లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించడం ద్వారా అతని సామర్థ్యాన్ని అంచనా వేయడం కష్టమనేది సెక్సాలజిస్టుల వాదన. రాజేష్ కేసును కేవలం నపుంసకత్వం కోణంలో చూడవద్దని, అతని ప్రవర్తనను సైకో కోణంలో చూడాల్సి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.

ఏం తేలుతుందో?
లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించినంత మాత్రానా రాజేష్ నపుంసకుడా? కాదా? అన్నది తేల్చడం కష్టమని కూడా డా.సమరం ఇదివరకే చెప్పారు. హార్మనల్ టెస్టుల ద్వారా అసలు విషయం బయటపడదని ఆయన అంటున్నారు.
ఆత్మవిశ్వాసం లేకపోవడం.. పెళ్లికి ముందు ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకుని విఫలమవడం వంటి పరిస్థితుల్లోనే రాజేష్ ప్రవర్తన ఈవిధంగా మారి ఉండవచ్చునని ఆయన అంచనా వేశారు.
అయితే లైంగిక పటుత్వ పరీక్షల్లో అయినా రాజేష్ మెడికల్ రిపోర్ట్ 'నార్మల్' అని వస్తుందా? లేదా? అన్నదే ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.

రిపోర్టే కీలకం:
లైంగిక పటుత్వ పరీక్షల రిపోర్ట్ రాజేష్ కేసులో కీలకం కానుంది. ఒకవేళ రిపోర్ట్ నార్మల్ అని వస్తే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
కాగా, తొలిరాత్రి నాడే రాజేశ్ నవవధువు శైలజపై దాడి చేసి.. తీవ్రంగా కొట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వధువు ఇంట్లోనే దంపతులకు తొలిరాత్రి ఏర్పాటు చేశారు.
వధువు శైలజ లోపలికి వెళ్లగానే.. తాను సంసారానికి పనికిరానని, ఈ విషయం బయట చెప్పవద్దని రాజేశ్ తొలిరాత్రి శైలజను కోరినట్టు తెలిసిందే. ఇదే విషయాన్ని ఆమె తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. తిరిగి మళ్లీ లోపలికి పంపించారు.

శైలజకు చిత్రహింసలు
తన బండారాన్ని బయటపెట్టడంతో ఆగ్రహించిన రాజేశ్ తొలిరాత్రే శైలజను అత్యంత క్రూరంగా హింసించి చితకబాదాడు. ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను తీవ్రంగా కొరికాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తొలిరాత్రే భర్త చేతిలో చిత్రహింసలు ఎదుర్కొన్న శైలజ ప్రస్తుతం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.












Click it and Unblock the Notifications