తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుక్ ఖాన్, గౌరీ ఖాన్, సుహానా, నయనతార
తిరుపతి: తిరుమల శ్రీవారిని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ దర్శించుకున్నారు. భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, ప్రముఖ నటి నయనతారతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులు షారుక్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారం.
అనంతరం గర్భాలయంలో స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సెప్టెంబర్ 7న షారుక్ నటించిన 'జవాన్' చిత్రం చిత్రం విడుదల కానుంది. ఈనేపథ్యంలోనే ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.

షారుక్‌ను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు. కొందరు సెల్ఫీలు కూడా తీసుకున్నారు. కాగా, ఆగస్టు 31న విడుదలైన జైవాన్ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో షారుక్ ఖాన్ తండ్రి కొడుకు రెండు పాత్రల్లో కనిపించనున్నారు.
తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపికా పదుకోన్, విజయ్ సేతు, ప్రియమణి, సాన్య మల్హోత్రా, యోగిబాబు, రిధి డోగ్రా కీలక పాత్రలు పోస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇప్పటికే జవాన్ సినిమా ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేపట్టారు.
#WATCH | Andhra Pradesh: Actor Shah Rukh Khan, his daughter Suhana Khan and actress Nayanthara offered prayers at Sri Venkateshwara Swamy in Tirupati pic.twitter.com/KuN34HPfiv
— ANI (@ANI) September 5, 2023
ఈ ప్రమోషన్స్‌లోభాగంగా చెన్నైకి రాగా.. మంగళవారం ఉదయం షారుక్ ఖాన్, నయనతార, మరికొంతమంది చిత్రయూనిట్ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. షారుక్ ఖాన్ తన జీవితంలో తిరుమలకు రావడం ఇదే తొలిసారి. సాంప్రదాయ దుస్తుల్లో సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమలకు వచ్చిన షారుక్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications