పవన్ కళ్యాణ్‌కు ఓటమి అలవాటే.. జబర్థస్త్ నటుడు షాకింగ్ కామెంట్స్
ఎన్నికలు ముగిసిన ఏపీ రాజకీయాలు మొత్తం కూడా పిఠాపరం నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడమే దీనికి కారణం. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. కాపులు అధిక సంఖ్యలో ఉండటం వల్లే పవన్ కల్యాణ్ పిఠాపురంను ఎంచుకున్నారని తెలుస్తోంది. దాదాపు 70 వేలకు పైగానే కాపు ఓటర్లు నియోజకర్గంలో ఉండటంతో పవన్ అక్కడ నుంచి పోటీ చేశారు.
ఇక పవన్ కల్యాణ్‌కు మద్దతుగా సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలి వచ్చింది. జబర్దస్త్ నటులు, సీరియల్ నటులు, మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్ నాగబాబు ,ఆయన భార్య , మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అల్లు అర్జున్,తేజా సజ్జా, రాజ్ తరుణ్ మొదలగు వారంతా కూడా పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిచారు. ఏపీ ప్రజలు మొత్తం కూడా పిఠాపురం ఫలితం కోసం ఎంతో అతృతుగా ఎదురు చూస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్...ఈసారైనా గెలిచి చట్ట సభల్లో అడుగుపెట్టాలని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు.

ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ గురించి జబర్థస్త్ నటుడు షకలక శంకర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్‌కు విజయాలకంటే అపజయాలే ఎక్కువ ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా ఫెయిల్యూర్‌గానే వచ్చారు. ఆయన లాంటి వ్యక్తి ఓడిన, గెలిచిన పెద్దగా తేడా ఉండదు. ఆయన అభిమానిగా పవన్ కల్యాణ్ గెలవాలని తాను కోరుకుంటున్నానని షకలక శంకర్ చెప్పుకొచ్చారు.పొలిటికల్‌గా కూడా ఆయన సక్సెస్ అవుతారని షకలక శంకర్ ఆశభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications