లక్ష ఓట్లను చీల్చిన షర్మిల
ఏపీలో ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు వెలువడుతున్న ఫలితాల్లో కూటమి నేతలు స్పష్టమైన అధిక్యంలో నిలిచారు. అధికార వైసీపీకి చెందిన మంత్రులు, కీలక నేతలు ఓటమి అంచునా నిలిచారు. ఏపీ మంత్రులుగా ఉన్న వారంతా ప్రస్తుతానికి వెనుకంజలో ఉన్నారు. వైసీపీ ఓటమి దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. రౌండ్ల వారిగా వెలువడుతున్న ఫలితాలను చూస్తే ఇది అర్థమవుతుంది.
వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరోవైపు వైసీపీ కంచుకోటల్లో కూడా టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే జగన్ గెలుపుపై చెల్లెలు షర్మిల తీవ్ర ప్రభావం చూపించిందని తెలుస్తోంది. కడప ఎంపీ స్థానానికి పోటీ చేసిన వైఎస్ షర్మిల వెనుకంజలో ఉన్నప్పటికి భారీగా ఓట్లు చీల్చినట్టు తెలుస్తోంది.

కానీ ఈ ఎన్నికల్లో అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓట్లను చీల్చారనే చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళితే..అన్న వైఎస్ జగన్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరిన షర్మిల కడపలో భారీగా వైసీపీ ఓట్లు చీల్చారు. ఏకంగా 1,09,620 ఓట్లు సాధించారు. అవినాశ్ రెడ్డి(వైసీపీ) 4,53,483 ఓట్లు, టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి 3,93,215 ఓట్లు సాధించి ఒక్కటి, రెండు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం అవినాష్ 60,268 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే పులివెందులలోనూ సీఎం జగన్ మెజార్టీని భారీగా తగ్గించారు.












Click it and Unblock the Notifications