బస్టాండ్‌లో ఒంటరి మహిళను వేధిస్తూ అడ్డంగా దొరికిన ప్రిన్సిపల్
హైదరాబాద్: ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతూ ఓ ప్రిన్సిపల్ షీ బృందానికి చిక్కాడు. గురువారం లక్డీకాపూల్ ప్రయాణ ప్రాంగణం వద్ద ఒంటరిగా ఉన్న మహిళను బైక్ ఎక్కమంటూ ఒత్తిడి చేసిన అతని ఘనకార్యాన్ని పోలీసులు వీడియోలో చిత్రీకరించారు.
నిందితుడి పేరు బాచుపల్లి గాయత్రి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దాన్ శెట్టి(38). బస్టాండులో బస్సు కోసం ఎదురు చూస్తూ కూర్చున్న ఓ మహిళకు అసభ్యకరంగా సంజ్ఞలు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు.
బైక్ పైన వచ్చిన అతను తన వాహనం పైన ఎక్కాలని మహిళను వేధిస్తున్న దృశ్యాన్ని షీ బృందం వీడియో తీసింది.
అనంతరం అతడిని అదుపులోకి తీసుకుంది. కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

మరో ఇద్దరు మైనర్లు చిక్కారు
తార్నాక బస్టాప్, మెహిదీపట్నంలో ఇద్దరు బాలురు, ఇద్దరు యువకులను షీటీంలు అరెస్టు చేశాయి. మౌలాలికి చెందిన ఇద్దరు బాలురు సికింద్రాబాదులోని తార్నాక బస్టాపులో గంటపాటు అటూఇటూ తిరిగారు. వివిధ ఫాఠశాలల నుండి వస్తున్న బాలికలను అసభ్యకరంగా వేధించారు.
ఈ దృశ్యాలను షీ టీంలు రహస్య కెమెరాల్లో బంధించి వారిని అదుపులోకి తీసుకున్నాయి. మలక్ పేటకు చెందిన నోమన్, అప్ఝల్ తమీమ్ మొహియుద్దీన్ ఓ బేకరీలో ఉన్న అమ్మాయిలకు చీటీలపై సెల్ నెంబర్లు రాసి ఇచ్చి ఫోన్ చేయమని వేధిస్తున్నారు. వీరిని షీ టీంలు ఆధారాలతో పట్టుకున్నాయి. వీరందర్నీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.












Click it and Unblock the Notifications