ఏపీలో జగన్, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే..తీరని అన్యాయం..!
మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుండగా.. 218 స్థానాల్లో మహాయుతి ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. కేవలం 55 స్థానాల్లో ఎంవీఏ ముందంజలో ఉంది. ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలుండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 ఎమ్మెల్యేలు అవసరం.ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని మహాయుతి మెజార్టీ సీట్లలో ముందంజలో ఉండటంతో ఆ కూటమి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.
అయితే మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఓటమిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్ చేశారు.మహాయుతి కూటమి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని కామెంట్ చేశారు. అజిత్ పవార్ , ఏక్‌నాథ్ షిండే చేసిన ద్రోహంపై మహారాష్ట్ర ప్రజలకు ఆగ్రహం ఉందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అఘాడీ కూటమికే మెజారిటీ సీట్లు వచ్చాయని.. ఇప్పడెలా ఫలితాలు మారాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ప్రజా తీర్పు కాదని.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలుస్తున్నారని ఆరోపించారు.

మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం మరోసారి ఖూనీ అయిందని సంజయ్ రౌత్ ఆరోపించారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీలు, ఇప్పుడు మాత్రం వెనుకపడ్డాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 13,ఉద్ధవ్ థాకరే(SHSUBT)పార్టీ 9, శరద్ పవార్ (NCPSP) పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే ఇప్పుడు మాత్రం ఆ మూడు పార్టీలు వెనుకంజలో ఉన్నాయి.
గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏపీలో సరిగ్గా ఇలాంటి ఆరోపణలే వినిపించాయి. 151 స్థానాల్లో ఉన్న వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 40 శాతం ఓట్లు సాధించినప్పటికీ స్థానాల్లో మాత్రం చాలా వ్యత్యాసం కనిపించింది.దీనికి తోడు పోలైన ఓట్లకు , లెక్కించిన ఓట్లలో కూడా తేడా రావడంతో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇలాగే ట్యాంపరింగ్ జరిగిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. దీంతో ఏపీలో జగన్‌కు, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరేకు తీరని అన్యాయం జరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications