వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ప్రశ్నిస్తే ప్రవచనాలు.. చంద్రబాబు గారూ ఈ ఐదింటికి జవాబు చెప్పండి?'

ప్రశ్నిస్తే చాలు ప్రవచనాలు మొదలుపెడుతారు. చెయ్యగలిగినవే మీరు మేనిఫెస్టోలో పెట్టండి. ఏ రాజకీయ పార్టీ అయినా చేయలేని అంశాలను మేనిఫెస్టోలో పెట్టవద్దు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రత్యేక హోదా ఉద్యమం విషయంలో సినీ నటుడు శివాజీ తొలినుంచి తన గొంతును గట్టిగానే వినిపిస్తున్నారు. ప్యాకేజీ ఉంపుడుగత్తె అని, హోదా వల్లే రాష్ట్రానికి ప్రయోజనం అని ఇదివరకు వ్యాఖ్యలు చేసిన శివాజీ.. తాజాగా సీఎం చంద్రబాబుకు ఐదు ప్రశ్నలు సంధించారు.

తాను సంధిస్తున్న ఐదు ప్రశ్నలకు గనుక సీఎం నుంచి సరైన సమాధానం లభిస్తే.. ఇకనుంచి ప్రశ్నించం ఆపేస్తాను అని శివాజీ స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ, కాపుల రిజర్వేషన్, ప్రత్యేక హోదా, నిరుద్యోగం వంటి అంశాలపై శివాజీ వరుస ప్రశ్నలు సంధించారు.

మొట్టమొదటి ప్రశ్న..

రైతులకు మీరు అధికారంలోకి రాగానే సంతకం పెట్టిన రుణమాఫీ పూర్తిగా చేయగలిగారా?..

రుణమాఫీ కావాలని ప్రజలు మిమ్మల్ని అడిగారా?.. మీరు మేనిఫెస్టోలో పెట్టారు.
ఆ రోజేమీ ప్రజలు మిమ్మల్ని అడగలేదే.. ఇలా చేయమని.

రెండవ ప్రశ్న 'కాపు రిజర్వేషన్‌'..

కాపు కులం మొత్తం వచ్చి మిమ్మల్ని ఏమైనా అడిగారా? కాపు రిజర్వేషన్‌ కల్పించండి, మానిఫెస్టోలో పెట్టండి అని?.. మీరు పెట్టారు, వాళ్లు ప్రశ్నిస్తున్నారు.

ఉద్దేశం ఏదైనా కానీ మీరు పెట్టారా.. లేదా? మీరు చేయగలుగుతున్నారా? ఒకవేళ మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పెట్టే ముందే బీసీ సంఘాలను ఒప్పించారా?

ఇది రెండు కులాలకు మధ్య చిచ్చుపెట్టడం కాదా?, పోనీ రిజర్వేషన్‌ కల్పిస్తే అది నిలుస్తుందని మీరు భావిస్తున్నారా? ఎందుకిచ్చారు హామీ?

మూడవ ప్రశ్న..

ప్రత్యేక హోదా గురించి ఆరోజు తిరుపతిలో మీరు వెంకయ్యనాయుడు, ఇద్దరు కలిసి ప్రధాన మంత్రిని ఒప్పించి పదేళ్లు కాదు పదిహేనేళ్లు కావాలి. ప్రత్యేక హోదా లేకపోతే ఈ రాష్ట్రం దేనికి పనికి రాదని చెప్పి అడిగారా, లేదా?

అలా అడగాలని మిమ్మల్ని ప్రజలేమైనా అడిగారా? మీకు మీరే.. అధికారం కోసం ఆ రోజున హామీ ఇచ్చారు. మరి ఈ రోజు దీనికి సమాధానం చెప్పండి?.

 Shivaji Five questions to Chandrababu Naidu

నిరుద్యోగం

ఎన్నికలకు ముందు.. బాబు వస్తే జాబు వస్తుందని ఆంధ్రప్రదేశ్‌లోని గోడలన్నింటి మీద రాశారు. ఒకవేళ జాబు రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి?. ఎవరికి నిరుద్యోగ భృతి ఇస్తున్నారు?.

అసలు సాధ్యంకాని హామీలు మీరు మేనిఫెస్టోలో ఎలా పెడతారండి?. విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ జనాభా ఎంత? దాని ఆర్థిక వనరులెంత?.. ఇదంతా మీకు తెలిసీ ఎందుకు హామీ ఇచ్చారు.

ఎందుకంటే.. ఓట్లు కావాలి మీకు, ప్రజలను ఆకర్షించాలి. ఆకర్షితులైన ప్రజలు ఈ రోజున తిరిగి అయ్యా మీరు చెప్పినవి చేయండని అడిగితే.. అభివృద్ధి నిరోధకులని మళ్లీ వారి పైనే ఆరోపణలు.. ఎవరు అభివృద్ధి నిరోధకులు?.. ఎవరు చేతగాని హామీలు ఇవ్వమన్నారు మిమ్మల్ని?.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి..

ఈ రోజు రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో ఉంది?. ఆంధ్రప్రదేశ్‌లో ఏ నియోజక వర్గానికి వెళ్లి అడగినా.. అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. ఇదా ప్రజలు మీ నుంచి కోరుకుంది?.

ప్రశ్నిస్తే చాలు ప్రవచనాలు మొదలుపెడుతారు. చెయ్యగలిగినవే మీరు మేనిఫెస్టోలో పెట్టండి. ఏ రాజకీయ పార్టీ అయినా చేయలేని అంశాలను మేనిఫెస్టోలో పెట్టవద్దు.

మన పిల్లలకి సరైన పాఠశాలలు ఉన్నాయా? సరైన ప్లే గ్రౌండ్స్‌ ఉన్నాయా? క్వాలిటీ ఎడ్యుకేషన్‌ అందిస్తున్నారా? గవర్నమెంట్‌ ఆసుపత్రిలో ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉంది చెప్పండి?

English summary
Tollywood Actor Shivaji Questioned CM Chandrababu Naidu on election manifesto of TDP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X