చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్‌కి సొంత జిల్లాలో షాక్: జగన్ పార్టీలోకి జెఎస్పీ నేత

By Pratap
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: సొంత జిల్లాలోనే మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి షాక్ తగిలింది. అది కూడా సొంత పీలేరు నియోజకవర్గంలోనే ఈ షాక్ తగిలింది. ఐదు దశాబ్దాలకు పైగా, రెండు తరాలుగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబంతో అనుబంధం ఉన్న బరకం రవికుమార్ రెడ్డి బుధవారం రాత్రి జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజంపేట లోకసభ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సమక్షంలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన చేరికను వైయస్సార్ కాంగ్రెసు, సీనియర్ నాయకులు వంగి మళ్ల మధుసూదన్ రెడ్డి, జెల్లా రాజగోపాల్ రెడ్డి స్వాగతించారు.

Shock in Chittoor district to Kiran Reddy

అలాగే కోన సర్పంచ్ పుల్లమ్మ, టిడిపి నాయకుడు రెడ్డెప్ప తదితరుుల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి జెఎస్పీ పీలేరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే, బరకరం రవికుమార్ రెడె్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడంతో జెఎస్పీకి తీవ్రమైన దెబ్బ తగిలింది.

మూడేళ్ల క్రితం మాజీ మండలాధ్యక్షుడు వంగిపుల్ల మధుసూదన్ రెడ్డి ముక్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డితో విభేదించి పక్కకు జరిగారు. రాతి బరకరం రవికుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడంతో కలకడ మండలంలో జెఎస్పీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినట్లే.

English summary

 Distancing from Jaisamaikyandhra party president N Kiran kumar Reddy in Chittooor district Rathi Barakam Ravikumar Reddy has joined in YS Jagan's YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X