బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు షాక్, విచారణకు రావాలని నోటీసులు
బెంగళూరు రేవ్ పార్టీ తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు సినీపరిశ్రమకు చెందిన నటీనటులు, సీరియల్స్ లో నటించే బుల్లితెర నటులు పాల్గొన్నారు. ఈ రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ వినియోగించారని ఈ రేవ్ పార్టీ వెనుక సెక్స్ దందా కూడా జరిగినట్టుగా అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న హేమకు బెంగళూరు పోలీసులు షాక్ ఇచ్చారు.
రేవ్ పార్టీలో లేనన్న హేమ తొలి వీడియో
అయితే బెంగళూరు రేవ్ పార్టీ ఎపిసోడ్ లో మిగతా వ్యవహారాలన్నీ ఒక ఎత్తు అయితే నటి హేమ వ్యవహారం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. రేవ్ పార్టీలో పట్టుబడిన హేమ, తాను ఏ పార్టీలకు వెళ్లలేదని హైదరాబాద్లోని ఒక రిసార్ట్ లో తాను చిల్ అవుతున్నానని, ఆ రేవ్ పార్టీలో తాను ఉన్నానని ఎవరు అనుకోవద్దని వీడియో రిలీజ్ చేసింది.

రేవ్ పార్టీలో హేమ ఉందన్న పోలీసులు
కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు రేవ్ పార్టీలో హేమ ఉన్న ఫోటోలను విడుదల చేశారు. ఆపై పోలీసులు ఈ రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్టుగా ధ్రువీకరించారు. పోలీసులు హేమ బెంగళూరు రేవ్ పార్టీలో ఉందని స్పష్టం చేసినప్పటికీ హేమ తనకేమీ సంబంధం లేదన్నట్టు జనానికి చెప్పడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు.
హేమ డ్రగ్స్ తీసుకుందని నిర్ధారించిన పోలీసులు
రేవ్ పార్టీలో పట్టుబడిన రోజు తెల్లారే ఇన్ స్టా గ్రామ్ లో చికెన్ బిర్యానీ రెసిపీ చెబుతూ ఏమీ ఎరుగని నంగనాచిలా నటించారు. నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకుందని తాజాగా జరిపిన రక్త పరీక్షల నమూనాలలో పోలీసులు నిర్ధారించారు. ఆమెకు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ రాగా హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణకు వచ్చారు. దీంతో తాజాగా ఈ కేసులో నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
హేమకు రేవ్ పార్టీ కేసులో నోటీసులు
రేవ్ పార్టీ కేసులో ఈనెల 27వ తేదీన విచారణకు రావాలని టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆమె రక్తం నమూనాలు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో ఆమెని విచారించాలని నిర్ణయించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హేమను విచారణకు రావాలని పిలిచారు. అసలు బెంగళూరు రేవ్ పార్టీతో తనకి సంబంధం లేదని బుకాయించిన హేమ ఇక ఈ నోటీసులపై ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications