రేషన్ విషయంలో ఇలా చేస్తున్నారా? అయితే మీ రేషన్ కార్డు రద్దవుతుంది జాగ్రత్త!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, సంక్షేమ పథకాల అమలు విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు సూచిస్తుంది. ఏపీలో ప్రస్తుతం రేషన్ కార్డు దారులు రేషన్ తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
రేషన్ కార్డు దారులకు షాకింగ్ విషయం చెప్పిన మంత్రి నాదెండ్ల మనోహర్
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా చేసిన ప్రకటనలో రేషన్ కార్డుదారులకు షాకింగ్ విషయాన్ని తెలిపారు. ఎవరైతే రేషన్ కార్డు ఉండి మూడు నెలపాటు వరుసగా రేషన్ తీసుకోకుండా ఉంటారో, వారి రేషన్ కార్డు ఆటోమేటిక్ గా రద్దు అవుతుందని ఆయన తెలిపారు. ఎవరైనా సరే ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటే ఆందోళన పడొద్దని, సమీపంలోని సచివాలయానికి వెళ్లి సమాచారం ఇవ్వాలన్నారు.

స్మార్ట్ కార్డుల పంపిణీపైనా కీలక అప్డేట్
సచివాలయంలో సమాచారం ఇచ్చి తిరిగి యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇది మాత్రమే కాదు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపైన కూడా కీలక ప్రకటన చేసిన ఆయన అక్టోబర్ 31వతేదీ వరకు ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. ఇక నవంబర్ ఒకటవ తేదీనుంచి స్మార్ట్ కార్డుల కోసం 35రూపాయలు రుసుము చెల్లించి పోస్ట్ ద్వారా పొందే వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు.
తప్పులు దిద్దుకునే అవకాశం కల్పించాం అన్న మంత్రి
ఎవరైతే తమ స్మార్ట్ రేషన్ కార్డులో పేర్లు ఇతర వివరాలు తప్పులు ఉంటాయో వారు వచ్చే నెలాఖరులోగా సరి చేసుకోవచ్చని సూచించారు. మీ ఆధార్ కార్డ్ లో ఏ విధంగా అయితే ఉంటే అదేవిధంగా రేషన్ కార్డులో కూడా వివరాలు వస్తాయని, ఆధార్ డేటా లో మార్పులు చేయకపోవడం వల్ల కొన్ని కార్డులలో తప్పులు వచ్చాయని ఆయన అన్నారు. దరఖాస్తు చేసుకుంటే వాటన్నింటిని సరి చేస్తామని వెల్లడించారు.
రేషన్ కార్డులు ఉన్న వారికి సూచనలు
అంతేకాదు రేషన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే, రేషన్ షాపుల వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ కార్డు లబ్ధిదారులు సమయానికి రేషన్ తీసుకోవాలని, రేషన్ కార్డులు రద్దు కాకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు.












Click it and Unblock the Notifications