కుమారి ఆంటీపై వైసీపీ పోస్టులు.. ఏం రాజకీయం గురూ!!

గత పదేళ్లుగా ఫుట్ పాత్ మీద భోజనం అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న కుమారి ఆంటీ ఇటీవల కాలంలో యూట్యూబ్లో బాగా ఫేమస్ అయ్యారు. తన వంటకాలతో భోజన ప్రియులకు కడుపునిండా భోజనం పెట్టడం మాత్రమే కాకుండా తద్వారా ఊహించని ఆదాయాన్ని సంపాదిస్తున్న కుమారి ఆంటీపై ప్రస్తుతం పొలిటికల్ గేమ్ మొదలైంది.

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఐటీసీ కోహినూర్ పక్కన ఉన్న రోడ్లో మధ్యాహ్నం వేళ ఒక పాక వద్ద స్ట్రీట్ వెండర్ కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ భోజనం చేయడం కోసం కింది స్థాయి ఉద్యోగుల నుండి ఉన్నత స్థాయి ఆఫీసర్ల వరకు ప్రతి ఒక్కరు వస్తుంటారు.

Shock to kumari aunty with YCP posts; political game on kumari aunty food business

కుమారి ఆంటీ గా అందరికీ సుపరిచితురాలైన దాసరి సాయి కుమారి ఫుడ్ బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుండగా ఆమె సంపాదన, ఆమె అక్కడ వండి తీసుకువచ్చి విక్రయించే తీరు పైన యూట్యూబ్ ఛానల్స్ హల్చల్ చేశాయి. దీంతో కుమారి ఆంటీ తక్కువ సమయంలోనే ఫేమస్ అయ్యారు.

అయితే అదే ఆమెకు ఇబ్బందికి తెచ్చిపెట్టింది. ఆమె వల్ల అక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, వెంటనే అక్కడి నుండి తన దుకాణాన్ని తీసివేయాలని ట్రాఫిక్ పోలీసులు హుకుం జారీ చేశారు. అయితే ఇక్కడే ఈ వ్యవహారం రాజకీయంగా మలుపు తిరిగింది. కుమారి ఆంటీ యూట్యూబ్ ఛానల్ వాళ్లతో మాట్లాడిన ఒక వీడియోలో ఊర్లో జగన్ ఇచ్చిన ఇల్లు మాత్రమే ఉందని పేర్కొన్నారు.

ఇక ఆ క్లిప్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి, సామాన్యులే మా స్టార్ క్యాంపెయినర్లు అంటూ ప్రచారం మొదలు పెట్టింది. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చెబితే వెటకారం చేసిన పెత్తందారులకు దిమ్మ తిరిగిపోయేలా చేసిన దాసరి సాయికుమారి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది వైసిపి.

ఆమె తనకంటూ ఆస్తి ఉందంటే అది జగనన్న ఇచ్చిన ఇల్లు మాత్రమే అని చెప్పడంతో, మంచి చేస్తే గుర్తింపు ఇలానే ఉంటుందని చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి వైసిపి పోస్ట్ పెట్టింది. ఈ వీడియో కారణంగానే కుమారి ఆంటీని అక్కడి ట్రాఫిక్ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని మరో పోస్ట్ పెట్టింది వైసిపి.

మొత్తానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ సీఎం వైయస్ జగన్ గారి పేరు వింటేనే వణుకు పుడుతోందని, అందుకే జగనన్న పాలనలో ఇల్లు వచ్చిందని చెప్పిన చిరు వ్యాపారి అయిన సాయి కుమారి మీద అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని పేర్కొంది.

తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వం ఉండడంతో ఆమె మీద దాడులకు ఈ దత్త తండ్రి కొడుకులు ఉసిగొల్పారని ట్వీట్ చేసింది. జగనన్న అభిమానిని చూసినా మీకు భయం అని చెప్పడానికి ఈ ఒక్క పరిణామం చాలు అంటూ వైసీపీ తన ట్వీట్ లో పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+