జగన్‌కు షాక్: టిడిపిలో చేరిన కీలక నేత, 'విలువైన నాణం దొరికింది'

కర్నూలు జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధర్మవరం సుబ్బారెడ్డి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

కర్నూలు: కర్నూలు జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధర్మవరం సుబ్బారెడ్డి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఆయన అభిమానులు డోన్‌లో ర్యాలీ నిర్వహించారు. ఓపెన్ టాప్ వాహనంపై నుంచి డిప్యూటీ సీఎం ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. దాదాపు గంటపాటు ర్యాలీ జరిగింది.

ys jagan

పసుపు జెండాలతో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కేఈ మాట్లాడారు. తమ పార్టీకి విలువైన నాణెం దొరికిందన్నారు. తమ కుటుంబంతో స్నేహం చేస్తున్న ధర్మవరం సుబ్బారెడ్డికి, వారి అనుచరులకు అన్ని రకాలుగా అండదండలందిస్తామన్నారు.

వచ్చే ఎన్నికల్లో కేఈ ప్రతాప్‌ను ఎమ్మెల్యేగా గెలిపించడానికి సిద్ధపడటం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం సుబ్బారెడ్డితో పాటు సింగిల్ విండో చైర్మన్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు పలువురు టిడిపిలో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+