జగన్ కు గట్టి షాక్! బీజేపీ వైపు మేకపాటి చూపు, ఇప్పటికే అమిత్ షాతో మంతనాలు!?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి బీజేపీలో చేరాలని భావిస్తున్నారా?

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి బీజేపీలో చేరాలని భావిస్తున్నారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల తరువాత మేకపాటి తన మనసును మార్చుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాక రెండు రోజుల క్రితం ఢిల్లీలో ఉన్న మేకపాటి... బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి ప్రత్యేకంగా చర్చించారు.

Shock to YS Jagan.. MP Mekapati going to join in BJP?

ఈ నేపథ్యంలో పార్టీ మారే విషయంలోనే ఆయన తన రాజకీయ భవిష్యత్ పై హామీని తీసుకోవడం కోసం అమిత్ షాను కలిశారని వార్తలు వినవస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కన్నా, బీజేపీలో చేరితే లాభం కలుగుతుందన్న ఆలోచనలో మేకపాటి ఉన్నట్టు సమాచారం.

అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి సమాచారమూ లేదు. ఒకవేళ ఈ వార్తలే గనుక నిజమైతే, అదే నిజమైతే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి బీజేపీలో చేరితే.. అది వైఎస్ జగన్ కు గట్టి షాక్ అనే చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+