వామ్మో ఏంటీ ఘోరం.. నిద్రిస్తున్న భర్తపై వేడి నీళ్లు పోసిన భార్య..!
పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు చెబుతారు. కానీ ఇప్పటి కాలంలో పెళ్లిళ్లు పట్టుమని పది రోజులు కూడా నిలవడం లేదు. అటు సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకూ ఇదే తంతు నడుస్తోంది. అనేక కారణాల వల్ల పెళ్లయిన కొన్నేళ్లకే దంపతులు విడిపోవడం చేస్తున్నారు. కొంతమంది బరితెగించి భర్తలను లేదా భార్యలను హతమారుస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి కథనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే విశాఖపట్నం జిల్లా భీమిలిలో జరిగింది.
విశాఖపట్నం జిల్లా భీమిలి పరిధిలోని నేరెళ్లవలస గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. నిద్రిస్తున్న భర్తపై భార్య సలసల కాగే వేడి నీళ్లు పోసింది. హత్యాయత్నానికి పాల్పడింది. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెలితే.. నందిక కృష్ణ, గౌతమి ఆరేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.

ఈ క్రమంలో బుధవారం రాత్రి గౌతమి.. నిద్రిస్తున్న తన భర్త కృష్ణపై వేడినీళ్లు పోసింది. దీంతో అతడి శరీరం కాలిపోయి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతను విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications