Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయవాడలో దారుణం: ఓ మహిళపై భర్త అత్యాచారం.. వీడియో తీసిన భార్య, ఆపై...

విజయవాడలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ భార్య భర్తలు చేసిన పని సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసింది. ఎదురింట్లో ఉన్న ఒక వివాహితను బలవంతంగా తన ఇంట్లోకి లాక్కొచ్చి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ నిందితుడు. ఇక భర్త చేస్తుంది తప్పు అని తెలిసి కూడా, అతను చేస్తున్న తప్పు పనికి సపోర్ట్ ఇచ్చి భర్త ఎదురింటి మహిళపై చేస్తున్న అత్యాచారాన్ని వీడియోలు, ఫోటోలు తీసి ఆడతనానికే మాయని మచ్చ తెచ్చింది ఓ భార్య.

ఎదురింటి మహిళపై భర్త అత్యాచారం, వీడియోలు తీసి సహకరించిన భార్య

ఎదురింటి మహిళపై భర్త అత్యాచారం, వీడియోలు తీసి సహకరించిన భార్య

అసలు వివరాల్లోకి వెళితే అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న వివాహిత పిల్లలతో కలిసి నిద్రపోతున్న సమయంలో, ఆమె ఇంట్లోకి వెళ్లిన ఎదురింటి భార్యాభర్తలు దిలీప్ తులసి లు ఆమెను బలవంతంగా వాళ్ల ఇంట్లోకి లాక్కెళ్లారు. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి తమ ఇంట్లోకి లాక్కెళ్ళి దిలీప్ ఆ మహిళపై అత్యాచారం చేశాడు. భర్త చేస్తున్న పాడుపనికి భార్య సహకారం అందించింది.

భర్త అత్యాచారం చేస్తుండగా భార్య తులసి వీడియోలు తీసి భర్తకు సహకరించింది. మహిళపై నిందితుడు రెండుమార్లు అత్యాచారానికి పాల్పడి, ఇక ఈ విషయం ఎవరికైనా చెబితే పిల్లలను చంపేస్తామని, ఫోటోలు, వీడియోలు బయట పెట్టి పరువు అంతా తీస్తామని హెచ్చరించాడు.

వీడియోలు చూపించి స్నేహితుల కోరిక తీర్చాలని బ్లాక్ మెయిల్ ..

వీడియోలు చూపించి స్నేహితుల కోరిక తీర్చాలని బ్లాక్ మెయిల్ ..

దీంతో సదరు మహిళ తనపై జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కుమిలిపోయింది. అంతటితో వదిలిపెట్టని దిలీప్ మళ్లీ తర్వాత రోజు కూడా ఫోటోలు, వీడియోలు చూపించి సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే పనిగా పెట్టుకున్న దిలీప్ ఆ తర్వాత తాజాగా తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలంటూ బాధితురాలిని పదేపదే వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో దిలీప్ బ్లాక్ మెయిల్ తట్టుకోలేక సదరు వివాహిత పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ .. కేసు నమోదు

పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ .. కేసు నమోదు

తనపై దిలీప్ అతని భార్య తులసి చేసిన దారుణాన్ని మహిళ పోలీసుల దృష్టికి తీసుకు వెళ్ళింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులపై పోలీసులు 376 (2), 354b, 354d, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దిలీప్, తులసిలను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Recommended Video

    MLA Jaggareddy Take On Electricity Bill Hike In Telangana | Oneindia Telugu
    విస్మయానికి గురి చేస్తున్న దారుణ సంఘటనలు

    విస్మయానికి గురి చేస్తున్న దారుణ సంఘటనలు

    సమాజంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవటం విస్మయానికి గురి చేస్తుంది. నాగరికత ముసుగులో అనాగరికంగా ప్రవర్తిస్తున్నారన్న భావన కలుగుతుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన మగవారికి ఆడవాళ్ళు కూడా సహకరిస్తున్న తీరు శోచనీయం. ముఖ్యంగా భార్య భర్తకు అత్యాచారం చెయ్యటానికి సహకారం అందించటం విన్నవాళ్ళంతా షాక్ కు గురయ్యేలా చేసింది. ఆడడానికి ఆడదే శత్రువు అన్న భావన ఈ ఘటనలో భర్తకు సహకరించిన భార్య తీరుతో అర్ధం అవుతుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+