షాకింగ్ : సొంత బాబాయిని చంపేసి ; శవం దగ్గర భయం లేకుండా నిలబడి యువకుడు ఏం చేశాడంటే !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి తగాదాలతో సొంత బాబాయిని చంపేసి, హతమార్చిన తర్వాత అవును.. నేనే చంపేశాను.. అయితే ఏంటి అంటూ శవం ముందు హంగామా చేసిన యువకుడు స్థానికంగా అందరినీ షాక్ కి గురి చేశాడు . ప్రకాశం జిల్లాలో సొంత బాబాయిని అత్యంత కిరాతకంగా హతమార్చిన యువకుడి షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఆస్తి తగాదాల పరిష్కారం కోసం స్పందనలో ఆర్జీ

ఆస్తి తగాదాల పరిష్కారం కోసం స్పందనలో ఆర్జీ

ఇంతకీ ఏం జరిగిందంటే ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని పెదారికట్ల ప్రభుత్వ మద్యం దుకాణం దగ్గర మద్యం తాగుతున్న వారంతా ఒక్కసారి అక్కడ జరిగిన షాకింగ్ ఘటనకు అవాక్కయ్యారు. కనిగిరి మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన 48 సంవత్సరాల వెంకటేశ్వరరావుకు ఆయన రెండో అన్న వెంకటనారాయణ కుటుంబంతో ఆస్తి వివాదాలు ఉన్నాయి. అయితే తమ ఆస్తి సమస్యలు పరిష్కరించాలంటూ వారం రోజుల క్రితం కనిగిరి లో జరిగిన స్పందన కార్యక్రమంలో వెంకటేశ్వరరావు అధికారులకు అర్జీ పెట్టుకున్నారు.

మద్యం సేవించి బాబాయిని హతమార్చిన యువకుడు

మద్యం సేవించి బాబాయిని హతమార్చిన యువకుడు

అధికారులు వచ్చి ఆస్తి తగాదా విషయంలో విచారణ చేశారు. దీంతో వెంకట నారాయణ కుమారుడు పుల్లారావు బాబాయ్ పై ఆగ్రహంతో రగిలిపోయాడు. పక్కా ప్లాన్ ప్రకారం బాబాయిని మద్యం షాప్ కి తీసుకువెళ్లి మద్యం తాగిన తర్వాత గొడవ పెట్టుకొని హతమార్చాడు. వెంకట నారాయణ కుమారుడు పుల్లారావు మద్యం తాగుదాం అంటూ బాబాయి వెంకటేశ్వరరావును పెదారికట్ల మద్యం దుకాణానికి తీసుకువెళ్ళాడు. ఇక మద్యం తాగిన తర్వాత ఆ వ్యవహారంలో మళ్ళీ గొడవ పెట్టుకొని బాటిల్ పగలకొట్టి గొంతులో పొడిచి చంపాడు. అంతేనా అక్కడి వారందరూ అవాక్కయ్యేలా హంగామా సృష్టించాడు.

తానే చంపానని .. నేనేం పారిపోలేదు .. అయితే ఏంటి అంటూ హంగామా

తానే చంపానని .. నేనేం పారిపోలేదు .. అయితే ఏంటి అంటూ హంగామా

అవును, నేనే నా బాబాయ్ ని చంపేశానంటూ మృతదేహం దగ్గర నుంచుని మాట్లాడాడు. రక్తపు మడుగులో ఉన్న మృతదేహం వద్ద ఉండి తానేం పారిపో లేదని, మర్డర్ చేసి ఇక్కడే ఉన్నాను అంటూ ఆస్తి గొడవలు వల్లే చంపేశానంటూ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఏంటి అంటూ హత్య ఘటనను చూస్తున్న వారిని ప్రశ్నించాడు. పథకం ప్రకారమే హత్య చేసినట్టు చుట్టూ గుమిగూడిన వారితో నిర్భయంగా చెప్పిన సదరు నిందితుడు తర్వాత శవాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు.

Recommended Video

    #ViralVideo : Man Argues With Police In Neredmet I నేను కేసీఆర్ మేన‌ల్లుడిని.. న‌న్నే ఆపుతారా..?
    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో .. రోజురోజుకీ మృగ్యంగా మానవసంబంధాలు

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో .. రోజురోజుకీ మృగ్యంగా మానవసంబంధాలు

    నిందితుడి మాటలు, ఎలాంటి భయం లేకుండా నిందితుడు హత్య చేసిన తీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాజంలో మానవ సంబంధాలకు, అనుబంధాలకు అర్థం లేకుండా పోతుంది అన్న భావన ఈ దారుణ ఘటనతో అందరికీ కలుగుతుంది.

    ఆస్తి కోసం సొంత బాబాయ్ హత్య మార్చిన అన్న కొడుకు, హత్య చేసిన తర్వాత చేసిన చేసిన హంగామా అతడిలో ఉన్న నేరప్రవృత్తికి అద్దం పడుతుంది. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఆస్తి కోసం, డబ్బుల కోసం అయిన వాళ్లను సైతం కడ తేరుస్తున్న నేటి పరిస్థితులు హానికరమైన సమాజ పోకడలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+