చేతులు దులుపుకున్న మహేష్ బాబు... ‘గుంటూరు కారం’ లేనట్లే?
ఒక అగ్ర కథానాయకుడి సినిమా వస్తుందా? రాదా? అనే ఉత్కంఠ తెలుగు సినీ పరిశ్రమలో రేకెత్తుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం గుంటూరు కారం. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఏ ముహూర్తాన ఈ సినిమా ప్రారంభమైందో కానీ అప్పటి నుంచి అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి.
మొదటిగా ఎంపిక చేసుకున్న కథానాయిక పూజా హెగ్డే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో సెకండ్ హీరోయిన్ గా ఎంపికైన శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయింది. మరో కథానాయికగా మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు. కృష్ణ జయంతి మే 31న గుంటూరు కారంకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. దానికి రెస్పాన్స్ అదిరిపోయింది. ఆ తర్వాతే ఈ సినిమా ప్రాజెక్టులో మార్పుచేర్పులు జరుగుతున్నాయి.

పూజా తప్పుకోవడంతోపాటు ఈ సినిమా కెమెరామెన్ కూడా తప్పుకున్నారు. తమన్ ను కూడా తప్పించారంటూ వార్తలు వస్తున్నప్పటికీ అదంతా పుకారే అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నాడు. మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని గ్లింప్స్ విడుదల చేస్తారనుకున్నారు. కానీ అటువంటిది ఏదీ జరగలేదు. రెండు పోస్టర్లు విడుదల చేసిన నిర్మాతలు చేతులు దులుపుకున్నారు.
మహేష్ బాబు కూడా తన ట్విటర్ ఖాతానుంచికానీ, ఇన్ స్టా గ్రామ్ ఖాతా నుంచి కానీ వీటిని షేర్ చేయకపోవడమే విచిత్రం. తన పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియజేసినవారందరికీ థాంక్స్ అటూ ఓ పోస్ట్ పెట్టి వదిలేశాడు. దీంతో గుంటూరు కారం సినిమాను మహేష్ బాబు పట్టించుకోవడంలేదంటూ వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా? లేదా ఆగిపోయిందా? అనే విషయమై చిత్ర బృందం ఖరారు చేయడంలేదు.












Click it and Unblock the Notifications