Shocking: నామినేషన్ ర్యాలీ వాహనంపై చెప్పులతో కొట్టుకోబోయిన వైసీపీ నేతలు

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నామినేషన్ల చివరి రోజు షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి సంజీవయ్య ముందరే నామినేషన్ వాహనంపై వైసీపీ నేతలు చెప్పులతో కొట్టుకోబోయిన ఘటన చోటు చేసుకుంది. పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం, వర్గ విభేదాలు ఎన్నికల సమయంలో బయటపడడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసిపి ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది.

చెప్పులతో కొట్టుకోబోయిన వైసీపీ నేతలు
అసలు ఇంతకీ ఈ రోజు ఏం జరిగిందంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సంజీవయ్య మళ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరిన సమయంలో ఎమ్మెల్యే వాహనం పైన ఉన్న ద్వితీయ స్థాయి నాయకులు గొడవ పడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకానొక సమయంలో ఇద్దరు నేతలు చెప్పులతో కొట్టుకునే పరిస్థితి చోటు చేసుకుంది.

Shocking YCP leaders fought on nomination rally vehicle in Sullurupeta Nellore

ద్వితీయ స్థాయి నేతల మధ్య వివాదం
ఎండీసీసీబీ ఛైర్మెన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి సూళ్లూరుపేట మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి ల మధ్య ఏర్పడిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఒకానొక సమయంలో చెప్పులతో కొట్టుకునే స్థాయికి చేరింది. ఈ వివాదం అంతా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ముందే జరిగింది. సంజీవయ్య వారి ఇద్దరి మధ్య ఘర్షణ ఆపేందుకు ప్రయత్నించే క్రమంలో పక్కకు తూలి పడబోయారు.

తొడలు కొట్టి సవాల్ చేసుకున్న నేతలు.. పోలీసుల ఎంట్రీ
ఇంతటితో ఆగని సత్యనారాయణ రెడ్డి, శేఖర్ రెడ్డిపై దూషణలకు దిగండంతో సహనం కోల్పోయిన శేఖర్ రెడ్డి తొడలు కొట్టి సత్యనారాయణ రెడ్డికి సవాల్ విసిరారు. ఇద్దరూ కొట్టుకునేందుకు సిద్ధం కాగా, సూళ్లూరుపేట సిఐ మధుబాబు ప్రచార వాహనం పై ఎక్కి శేఖర్ రెడ్డిని కిందకు దించేయడంతో పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగింది.

ఇలా అయితే కష్టమే
ఈ సమయంలో ఎమ్మెల్యే సంజీవయ్య సత్యనారాయణ రెడ్డి గడ్డం పట్టుకుని బుజ్జగించడం, శేఖర్ రెడ్డి ని వెళ్ళిపోవద్దు ప్రచార రథం పైకి రావాలని బ్రతిమిలాడడం చోటు చేసుకుంది. ఇక ఇరువురు నేతల మధ్య ఘర్షణ నేపథ్యంలో వైసీపీ నేతలు ఇలాగే ఉంటే రాబోయే ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఈ ఘటనపై స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+