ఓడిపోతారు: కెసిఆర్‌ను ఏకిపారేసిన శ్రవణ్ కుమార్

నిరాశ, నిస్పృహలతోనే కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ అంటున్నారని ధ్వజమెత్తారు. విశ్వసనీయతకు, విశ్వాస ఘాతుకానికి మధ్య ఈ ఎన్నికలు అన్నారు. కెసిఆర్ ప్రతి దానికి తల నరుక్కుంటానని చెబుతారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తెరాస అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. కెసిఆర్‌ను ఏ రాజకీయ పార్టీ కూడా నమ్మదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదన్నారు. విశ్వసనీయత లేని వ్యక్తి కెసిఆర్ అన్నారు. రెండు శాతం సీట్లు కూడా ముస్లింలకు ఇవ్వని కెసిఆర్ 12 శాతం రిజర్వేషన్ ఇస్తారంటే ఎవరు నమ్ముతారన్నారు.
బిజెపితో సయోధ్య కోసం ఎంతో ప్రయత్నాలు చేసిన కెసిఆర్.. తాను సెక్యులర్ అని చెప్పుకోవడం దారుణమన్నారు. కెసిఆర్‌కు సిఎం పదవి కావాలన్న యావ తప్ప మరొకటి లేదని, తన పదవి, తన పాలన, తన కుటుంబమన్నదే కెసిఆర్ సూత్రమని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications